ScienceAndTech

బ్లాక్‌చెయిన్‌తో స్పాం కాల్స్ కట్టడి

preventing spam and marketing calls using blockchain technology

టెక్నాలజీ కంపెనీ టెక్‌ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్‌ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది. గతేడాది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్‌ ప్రాక్టీస్‌ లీడర్‌ రాజేశ్‌ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్‌ రంగాల్లోనూ బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు.