DailyDose

ఆంధ్రాలో అమ్ముకుంటున్న అంబానీలు-వాణిజ్య-05/16

Anil ambani selling off assets in andhra pradesh coastal andhra site for sale by anil reliance group

*రుణ భారం పెరిగిపోయి ఆర్ధికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు దీని నుంచి బయట పాడటానికి కొన్ని ఆస్తులను అమ్మకానికి పెడుతోంది. ఇందులో భాగంగా కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ కు చెందిన స్థలాన్ని విక్రయించటానికి సిద్దమైంది.
*మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వండర్‌లా హాలీడేస్‌ రూ.6.99 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ ఆర్జించిన రూ.3.68 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 90 శాతం అధికం.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ రూ.440 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ (జే అండ్‌ కే బ్యాంక్‌) రూ.214.80 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
* గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మహీంద్రా హాలీడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.14.42 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
* మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2,477.41 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
*రీట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌) లిమిటెడ్‌లో 15 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయిస్తోంది.
*చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఉపయోగపడే డాప్టోమైసిన్‌ సూదిమందును అమెరికాలో విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఇది మెర్క్‌ షార్ప్‌ అండ్‌ డాహ్మే కార్ప్‌నకు చెందిన క్యూబిసిన్‌ ఔషధానికి జనరిక్‌ రూపం. మార్చి 2019 వరకూ ఏడాది కాలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే.. క్యూబిసిన్‌ ఇంజక్షన్‌ అమ్మకాలు దాదాపు 640.8 మిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నాయి.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.119.34 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
* ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న గృహ ప్రాజెక్టులకు 2019 ఏప్రిల్‌ 1వ తేదికి ముందే కంప్లిషన్‌ సర్టిఫికేట్‌ (స్వాధీన ధ్రువీకరణ పత్రం) పొందినట్లయితే మిగతా చెల్లింపులకు 12 శాతం జీఎస్‌టీనే వర్తిస్తుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది.
*నగదు చెలామణి తగ్గించి, డిజిటల్‌ లావాదేవీలు మరింత అధికంగా జరిగేలా చూడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ‘పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఇండియా 2019-21’ దార్శనికపత్రాన్ని విడుదల చేసింది.

*సెన్సెక్స్‌ 204 పాయింట్లు డౌన్…. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 204 పాయింట్లు నష్టపోయింది. 37,115 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 11,157 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 50లో బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐఓసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. అదేసమయంలో యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి. యస్‌ బ్యాంక్‌ ఏకంగా 9 శాతం పడిపోయింది. టాటా మోటార్స్‌ కూడా 7 శాతానికి పైగా క్షీణించింది.  సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ మాత్రం లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు ఎక్కువగా పడిపోయాయి