Editorials

వర్గాలుగా విడిపోయి దెబ్బలాడుకుంటున్న ఆంధ్రా IASలు

Andhra IAS Cadre Stands Divided between ruling and opposition parties

దేశంలో ఐఏఎస్ అందరిదీ ఒక దారయితే , ఏపీ ఐఏఎస్ లుది మరోదారి . ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఐఏఎస్ లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం అధికార పార్టీకి అండగా నిలిస్తే మరోవర్గం ప్రతిపక్ష పార్టీకి దగ్గరగా ఉంటోంది. అందుకే ఏ రాష్ట్రంలో రాణి విధంగా ఏపీ ఐఏఎస్ అధికారుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే బిల్ కలెక్టర్ కు ఉన్న గౌరవం కూడా కలెక్టర్ కు దక్కదని గుర్తించారు. నవ్యంద్ర ఐఏఎస్ సంఘ పెద్దలు. అందుకే గతనెలలో రహస్యంగా భేటి అయి తమకు పడిపోతున్న పరపతి పై వాస్తవాలను గుర్తించారు. గతంలో ఐఏఎస్ ల వ్యవస్థల పై ప్రజలకు నమ్మకం, రాజకీయ నేతలకు గౌరవం దున్దేదని కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదని కొందరు పెద్దలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. నేతలతో అంతకగడం వ్యక్తిగత ప్రయోజనాలకు తాపత్రయం పడటమే ఇటువంటి పరిస్థితి దపురించిఅదానికి కారణమని కొందరు చెప్పారు. ఇకపై పనితీరు మెరుగు పరచుకోవడంతో పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆ భేటీలో నిర్ణయించి దాన్ని అమలు చేస్తున్నారు. రహస్య భేటి తరువాత ఐఏఎస్ ల పనితీరులో మార్పు వచ్చిందని కొద్ది రోజుల్లోనే గౌరవ భావాలు పెరిగిపోయాయని ఐఏఎస్ సంఘం నేతలు గుర్తించారు. ఇదే తీరు కొనసాగాలనే లక్ష్యంతో మరొక రహస్య భేటీ నిర్వహించాలని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ భేటీ జరగవచ్చని కూడా ప్రచారం సాగుతుంది. అయితే గత భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అందరూ ఐఏఎస్ లు నడుస్తునప్పుడు ఇప్పుడు తాజాగా మరో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఎంటనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడంలేదు దీనితో ఈసారి నిర్వహించబోయే భేటీ పరమార్ధం వేరనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఐఏఎస్ లు త్వరలో నిర్వహించే రహస్య సమావేశం పూర్తిగా భిన్నమైనదనే వాదనలు వినిపిస్తున్నాయి. 23న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ తరువాత రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రాబోతుందనేది స్పష్టమవుతుంది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొందరిపై కక్ష సాధింపులు తప్పకపోవచ్చు. అందుకే ఐకమత్యంతో ముందుకు సాగాలని, ఒకరికి ఆపద వస్తే, ఆదుకోవడానికి ఇతరులు ముందుకు రావలసిన ఆవశ్యకతను తెలియజెప్పేందుకే భేటీ నిర్వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి సన్నిహితంగా మెలిగిన ఐ.ఏ.ఎస్.లు, అదేపార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఐ.ఏ.ఎస్.లను కాపాడాలనే లక్ష్యమే ప్రధాన ఎజెండా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.ముందు చూపుతోనే రహస్య భేటీ నిర్వహించబోతున్నారన్న ప్రచారాన్ని పలువురు ఐ.ఏ.ఎస్.లు ఖండిస్తున్నారు. తమ పనితీరు మార్చుకునే అంశంపైనే భేటీ తప్ప మరొకటి కాదని వారంటున్నారు. ఒకవేళ ఐ.ఏ.ఎస్.లు చెప్పేదే నిజమైతే, రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేసిన వారు ఇప్పటివరకు ఆ ప్రమాణానికి విరుద్దంగా పనిచేసినట్లు ఓప్పుకున్నట్లేగా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కారణమేదైనా ఐఏఎస్ లాంటి ఉన్నత వ్యక్తులే సాధారణ వ్యక్తుల్లాగా అస్తిత్వం కాపాడుకోసం ప్రయత్నించడం ఏపీలో తప్పా మరెక్కడా కనిపించదేమో.