ScienceAndTech

రోబోలపై పరిశోధనలకు భారతీయ శాస్త్రవేత్తలు అమెరికా నిధులు

US Defense Issues 140 Crore INR to Indian researchers on robots

*** భారతీయ శాస్త్రవేత్తల బృందానికి రూ. 140 కోట్లు
ఆలోచనల ఆధారంగా రోబోలను నియంత్రించగలిగే సాంకేతికతను అభివృద్ధి పరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టుకు అమెరికా రక్షణశాఖ సుమారు రూ.140 కోట్లు వ్యయం చేస్తోంది. భారతీయ మూలాలున్న గౌరవ్‌శర్మ(40) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి ఈ నిధులు కేటాయించింది. మానవరహిత వాహనా (యూఏవీ)లు, బాంబులను పేలకుండా వెలికితీసే రోబోలను మెదడు ఆలోచనలతో నియంత్రించే వ్యవస్థను ఈ బృందం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.