DailyDose

రాజ్యసభకు సుష్మా అద్వానీ-తాజావార్తలు–06/04

Sushma Advani To Be Sent To Rajyasabha

*లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న భాజాపా సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆపార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతల పై ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోశీలను పార్టీ పోటీకి నిరాకరించింది. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్ర మంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి.
* రోడ్డు రవాణా, రహదారుల శాఖ కేంద్ర మంత్రిగా నియమితులైన నితిన్ గడ్కరీ బాధ్యతలు స్వీకరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) మంత్రిగానూ విధులు చేపట్టారు. ప్రతాప్ చంద్ర సారంగి ఇదే శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
* పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని ఎలా ప్రక్షాళన చేయాలి? నూతన నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 7 నుంచి చంద్రబాబు కొద్ది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి పార్టీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, చినరాజప్ప, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని హాజరయ్యారు.
* కృష్ణా జిల్లాకంచికచర్ల మద్యం షాపు వద్ద రెండు కులాలకు చెందిన వ్యక్తులు మద్య ఘర్షణ…..ఒక కులానికి చెందిన వ్యక్తి మరొ కులానికి చెందిన వ్యక్తి పై దాడి చేసారని ఆరోపణ……పొలిసు స్టేషన్ కి పిర్యాదు ఇవ్వడానికి వెల్లగా పోలిసులు దురుసుగా ప్రవర్తించారని. పొలిసు స్టేషన్ ఎదుట ఆందోళన.
*ఏపీ సీఎం జగన్‌ విశాఖలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్‌కు పీఠం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠానికి చేరుకున్న జగన్‌ ..స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
*నైరుతి రుతుపవనాలు ఈ నెల 6న కేరళ.. 15, 16 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయని వాతావరణ నిపుణులు ప్రొఫెసర్‌ భానుకుమార్‌ తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆన్ సెట్ కావడానికి మూడు మహా సముద్రాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం తగ్గడం మంచి పరిణామంగా పేర్కొన్నారు
*తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి కొద్ది సేపటిలో రాంపూర్ పంప్ హౌస్ పనులను పరిశీలించనున్నారు. ఇందు కోసం ఆయన ఇప్పటికే రాంపూర్ చేరుకున్నారు. అలాగే ఎస్సారెస్సీ పనులను కూడా ఆయన పరిశీలిస్తారు. అనంతరం మేడిగడ్డ పనులను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
*మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కుంది. ఈనెల తొమ్మిది నుంచి 21 వరకు నోవాతెల్ జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో ఇండియన్ ఓపెన్ ట్యూనా కమిషన్ ఓ సదస్సు నిర్వహించనుంది. ట్యూనా జాతీ చేపల సంతతి పెంపొందించడమే వాటి లక్ష్యం
*డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరును డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా ప్రభుత్వం మార్చింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య శ్రీ శాఖ సమీక్షా సమావేశాలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
*హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో వివిధ బ్లాకుల్లో ఉన్న విలువైన సమాగ్రీని వెంటనే అమరావతికి సచివాలయమనిల్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలన శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.
*ఆంధ్రప్రదేశ్ మీట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పరిమి ప్రకాష్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం రాజీనామా లేఖను పంపించి వెంటనే ఆమోదించాలని కోరారు.
*టీవీ 9 సిఈవో రవిప్రకాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్తం చేసింది.
*ఆంధ్రప్రదేశ్లో జగన్ నేతృత్వంలో ఏర్పాటైన సర్కారు తెలంగాణలో సఖ్యతను కలిగి ఉన్నందున అక్కడకు కమలనాధన్ కమిటీ ద్వారా పంపిన తెలంగాణా స్థానికత గల ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకురావాలని తెలంగాణ సర్కారుకు టీఎన్జీవోల సంఘం విజ్ఞప్తి చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
* తిరుపతి అనంత వీధిలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు, కోడలు కలిసి ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. భర్త సహకారంతో రెచ్చిపోయిన వృద్ధుడి కోడలు..మామగారి ముఖంపై కారంపొడితో దాడి చేసింది. ఇందుకు ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ఈ క్రమంలో బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*గ్రూప్‌-2 రాత పరీక్షల్లో రెండుసార్లు (డబుల్‌) బబ్లింగ్‌ వ్యవహారంలో తలెత్తిన వివాదానికి హైకోర్టు తెరదించింది. వ్యక్తిగత వివరాల నమోదులో భాగంగా రెండుసార్లు బబ్లింగ్‌ చేసినవారిని పక్కన పెట్టాలన్న సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది.
* ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీ ధరపై కిలో చొప్పున పంచదార సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల అదనంగా 16.3 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ప్రభుత్వానికి అదనంగా రూ.4,727 కోట్ల భారం పడనుంది.
*తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును (ఎస్సారెస్పీ) రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం జలంతో నింపే పునరుజ్జీవ పథకం పనులు పరుగుపెడుతున్నాయి.
*జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా అజిత్‌ డోభాల్‌ (74) రెండోసారి నియమితులయ్యారు. ఈసారి ఆయన హోదాను కేబినెట్‌ మంత్రి స్థాయికి పెంచినట్లు అధికారిక ఉత్తర్వులు తెలిపాయి. మోదీ సర్కారు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే తొలి కీలక నియామకం.
*హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం కేటాయించిన భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించే ప్రక్రియ ఈ నెలాఖరు పూర్తయ్యే అవకాశం ఉంది.
*ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కల్పించే ‘‘సాధారణ సమ్మతి’’ (జనరల్‌ కన్సెంట్‌)ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం దిల్లీ చేరుకున్న నరసింహన్‌ ప్రధాని మోదీతో కొద్దిసేపు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలను ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం.
*మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈనెల 9 నుంచి 21 వరకు నోవోటెల్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ఆధ్వర్యంలో ‘ఇండియన్‌ ఓషన్‌ ట్యూనా కమిషన్‌’ ఓ సదస్సు నిర్వహించనుంది. ట్యూనా జాతి చేపల సంతతి పెంపొందించడం, వాటి సంరక్షణ, మాంసం ఉత్పత్తిని విస్తృతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 33 దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సు తొలిసారిగా భారత్‌లో జరుగుతుందని మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ తెలిపారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడంతోనే మన దగ్గర ట్యూనా మాంసం వినియోగానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్న కమిషన్‌, 23వ సదస్సుకు హైదరాబాద్‌ను ఎంచుకుందని ఆమె పేర్కొన్నారు.
*హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్బంధ పాఠ్యాంశం చేయాలన్న కస్తూరి రంగన్‌ కమిటీ సిఫారసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
*బొగ్గు గనుల వల్ల నిర్వాసితులైన వారికి పరిహారం త్వరగా చెల్లించాలని కంపెనీ తరపున జాప్యం జరగకుండా చూడాలని సింగరేణి అధికారులకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ సూచించారు.
* రాష్ట్ర అధికార యంత్రాంగంలో సమూల మార్పులు జరగనున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు భారీ ఎత్తున స్థాన చలనం కలగనుంది. జూనియర్‌ అధికారులు మొదలు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వరకు సుమారు 70-80 మందిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనుంది.
*సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలోని వివిధ మండల కేంద్రాల్లో ప్రారంభించిన తాత్కాలిక అన్న క్యాంటీన్లు మూతపడుతున్నాయి. నిర్వహణ సంస్థకు రూ.45 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడంతో వీటికి ఆహార సరఫరాను నిలిపివేస్తున్నారు.
*మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జులై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగల ఆత్మగౌరవ జాతరను నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.
*ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో 2019-20 వైద్యవిద్య సంవత్సరానికి ప్రవేశాల కోసం గత నెల 5న నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నారు.
*విజయవాడ గాంధీ నగర్ ఇండియన్ బ్యాంక్ వద్ద అగ్ని ప్రమాదం.. మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది
* జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. తాను పోటీచేసిన రెండు చోట్ల ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆ బాధ నుంచి ఇంకా తేరుకోని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ నేతలు గట్టి షాక్ స్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ఎర్రంకి సూర్యారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్,నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.