ScienceAndTech

అంధుల కోసం అల్ట్రాసోనిక్ చేతికర్ర

Gujarat students create ultrasonic blind walking stick

అంధులను ప్రమాదాల నుంచి కాపాడే వినూత్న కర్రను గుజరాత్‌ విద్యార్థులు రూపొందించారు. గుంతలు, నీటితో నిండిన ప్రదేశాలు, చీకటి ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు అంధులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా అల్ట్రాసోనిక్‌ వాకింగ్‌ స్టిక్‌ను తయారుచేశారు. సూరత్‌ జిల్లాలోని బార్దోలీ తాలూకాలో ఉన్న ఎన్‌జీపటేల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు ఈ నూతన ఆవిష్కరణను అందుబాటులోకి తెచ్చారు. అర మీటరులోపు ఏదైనా ప్రమాదం ఉందని గుర్తిస్తే, వెంటనే ఇందులో అమర్చిన స్పీకర్లు హెచ్చరికలు పంపుతాయి. అప్పుడు ప్రమాదానికి గురి కాకుండా అంధులు తమ నడకను ఆపవచ్చు. ఈ కర్రను పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకున్నా తిరిగి రిమోట్‌తో గుర్తించొచ్చవచ్చని దీపక్‌ కుస్వాచే అనే విద్యార్థి చెప్పాడు.