Food

అల్లం రక్తాన్ని పలుచన చేస్తుంది

Ginger is blood thinner and prevents heart strokes

మనం చేసుకునే వంటల్లో అల్లంను వేయడం వల్ల వాటికి చక్కని రుచి వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు, ఔషధ గుణాలను కలిగి ఉండడంలోనూ అల్లం పెట్టింది పేరు. ఎంతో కాలం నుంచి భారతీయులు అల్లంను పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే మనం నిత్యం అల్లంను ఎందుకు తీసుకోవాలో, దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉదయం లేవగానే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పరగడుపునే అల్లం రసం తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల పైత్యం పోతుంది. వికారం సమస్య తగ్గుతుంది.

2. పీరియడ్స్ ప్రారంభం అయ్యే ముందు స్త్రీలు అల్లం రసం సేవిస్తుంటే రుతు సమయంలో వచ్చే నొప్పి కొంత వరకు తగ్గుతుంది.

3. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 3 నుంచి 30 నెలల పాటు 56 మంది పేషెంట్లకు నిత్యం అల్లం రసం ఇచ్చి వారిలో ఉన్న ఆర్థరైటిస్ లక్షణాలను పరిశీలించగా.. కొద్ది వారాల అనంతరమే చాలా మందిలో నొప్పులు, వాపులు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల నిత్యం అల్లంను తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

4. రక్తాన్ని పలుచగా చేయడంలోనూ అల్లం బాగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు వచ్చే వారికి, వస్తుందనుకున్న వారికి ఉపయోగపడే విషయం. వారు అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

5. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.

6. జీర్ణసమస్యలు ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తే ఫలితం ఉంటుంది. అల్లం రసం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ రాకుండా చూస్తుంది. మలబద్దకం ఉండదు.

7. తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా అల్లం అమోఘంగా పనిచేస్తుంది. అల్లం రసం లేదా అల్లం కషాయం సేవిస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.