DailyDose

బాబాయి హత్య కేసులో నిందితులకు బెయిల్-నేరవార్తలు–06/27

Daily Crime News - YS Viveka Murder Accused Gets Bail - June 27 2019

* తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు బెయిల్‌ మంజూరైంది. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై అరెస్టయిన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌కు పులివెందుల న్యాయస్థానం గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ ముగ్గురూ అరెస్టై 90 రోజులు పూర్తికావడంతో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దాదాపు మూడు నెలలైనా ఈ కేసులో నిందితులపై పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడం గమనార్హం.
* జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న ఓ మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది మృతిచెందారు. వీరిలో 9మంది విద్యార్థినులు ఉన్నారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
* ఆటో బోల్తాపడి ఏడుగురు తీవ్రంగా గాయపడిన ఘటన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామ సమీపంలో గురువారం జరిగింది.
* తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు పరిధి కీలనాథం ప్రాంతంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చడం కారణంగా మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేపట్టారు.
*టిక్ టాక్ ఇప్పుడిదో వేలం వెర్రిగా మారిపోయింది. ప్రతి ఒక్కరిని వ్యసనంగా ఒక పాటకో.. డైలాగ్ కు లిప్ మూమెంట్ ఇచ్చి, హావభావాలు ఒలికించి వీడియోలు తీసుకుంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా టిక్ టాక్ కు బానిసలవుతున్న వాళ్ళే తాజాగా ఓడిశాలోని ఓ ఆస్పత్రిలో నర్సుల టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
* కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం వడ్లూర్ క్రాసింగ్‌ దగ్గర ఓ కారు అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు.
* పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.
* గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాప్టిస్ట్ చర్చి గోడల ధ్వంసం కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులుA3 దుర్గంపూడి బాల అంజిరెడ్డిA4 శోభన్ బాబు లతో సహ మరోడుగురి అరెస్ట్ .మరో ఇద్దరి పాత్రపై కోనసాగుతున్న విచారణ.
* కామారెడ్డిజిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వెనుక నుంచి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డీజిల్ ట్యాంకర్ పేలి పూర్తిగా దగ్ధమైంది.
* పెబ్బేర్ జాతీయ రహదారిపై ఉదయం రోడ్డు ప్రమాదం. వల్లపురెడ్డి పంక్షన్ లో, ఓ పంక్షన్ కు హాజరై టీ తాగడానికి, బైక్ పై వెళ్లిన ఇద్దరు రవియాదవ్, హారీష్ ను. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న కారు బైక్ ను డీ కొట్టడంతో, బైక్ సుమారు 30 మీటర్ల దూరం పడి కాలిపోయింది.
* దర్గాకు వచ్చే భక్తుల నుంచి భిక్షాటన చేసి రూపాయి.. రూపాయి కూడబెట్టాడు. భిక్షగాడే కదా.. అని అందరూ అనుకొన్నారు. ఆయన మృతి అనంతరం తెలిసింది.. లక్షాధికారి అని. వివరాల్లోకి వెళితే… బషీర్‌ (75) అనే భిక్షగాడు పాతగుంతకల్లులోని మస్తాన్‌వలి స్వామి దర్గాలో బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు.
* ప్రకాశం అద్దంకి సర్కిల్‌ పరిధిలోని పలు మండలాలలో ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి …. పొలాలకు వెళ్లే మహిళల మెడలో గొలుసులను చోరీ చేస్తున్న యువకుడిని గురువారం స్థానిక డిఎస్‌పి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. నిందితుడి వద్ద 96 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
* కర్ణాటక రాష్ట్రం, మంధ్య జిల్లా, మద్దూర్‌ గ్రామానికి చెందిన మొహ మ్మద్‌ మెహబూబ్‌ బేగ్‌ అలియాస్‌ అజ్గర్‌ బేగ్‌, కర్ణాటక, మంధ్య జిల్లా, గంజాం గ్రామా నికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌ 2018 మార్చి 30న నకిలీ నోట్లు కలిగి ఉన్నారని విశాఖప ట్నం పోలీసులకు సమాచారం అందింది.నిందితులను విశాఖ రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేసి వారి నుంచి రూ.10.20 లక్షల నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
* నకిలీ నోట్లు చలామణీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయ మూర్తి బుధవారం తీర్పు చెప్పారు.
* పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.
* ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి దాబా సమీపంలో చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం తర్నీకల్ గ్రామానికి చెందిన ఉప్పరి మురళీ (38)అనే వ్యక్తి దాబా సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.
* కామారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
*మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆకాశ్ విజయ్ వర్గియా అరెస్టయ్యాడు. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన ఎమ్మెల్యే ఆకాశ్ పై పోలీసులు కేసు పెట్టారు. అధికారిపై చేయి చేసుకున్న మరో పది మంది ఎమ్మెల్యే అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి. దీంతో… ఎమ్మెల్యేతోపాటు.. 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు.
*పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు. రియా సత్ అలీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా… మహమ్మద్ అన్వర్ అనే ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు మహ్మద్ అన్వర్. రక్తపుమడుగులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన అన్వర్ ను 108 అంబులెన్స్ లో గాంధీకి తీసుకెళ్లారు పోలీసులు. కొందరు పోలీసులు స్పాట్ లోకి వెళ్లారు. రియాసత్ ఆలీని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మహమ్మద్ అన్వర్ చనిపోయాడు. ఆటో డ్రైవర్ రియా సత్ అలీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
*చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.కోటి విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*ఇంటి పైకప్పు కూలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకల్యాణ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
*కర్ణాటకలోని రామనగర పట్టణం టిప్పునగరలో రెండు నాటు బాంబులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం స్వాధీనం చేసుకుంది.
*మలేసియా పోలీసులు నలుగురు భారతీయులను అరెస్టుచేసి, వారినుంచి దాదాపు 5వేల తాబేళ్లతో పాటు 14 కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
*మధ్యప్రదేశ్లో భాజపా సీనియర్ నేత కైలాష్ విజయ్వర్గియా కుమారుడు, ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వర్గియా ఓ పురపాలక అధికారిపై క్రికెట్ బ్యాట్తో దాడికి పాల్పడ్డారు.
*ఆడుకుంటున్న ఓ బాలుడిపై ఐదు శునకాలు సామూహిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
* అయిదేళ్ల చిన్నారి ఓ ప్రైవేటు పాఠశాల వాహనం కిందపడి మృతిచెందిన సంఘటన బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లిలో చోటు చేసుకుంది.
*హైదరాబాద్లో నడిరోడ్డు మీద మరో దారుణహత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట కూడలిలో ఓ ఆటో డ్రైవరు మరో ఆటోడ్రైవరును దారుణంగా పొడిచి చంపిన సంఘటన తీవ్రకలకలం రేపింది.
*భాగ్యనగరంలో బుల్లితెర నటి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వారం రోజుల క్రితం ఆమె నివాసముంటున్న ఓ ప్రైవేటు వసతిగృహం నుంచి ఓ వ్యక్తి వచ్చి తనతో తీసుకుపోయినట్లుగా పోలీసులు తెలిపారు.
*తన కారును వెనక నుంచి ఢీ కొట్టాడన్న కోపంతో ఓ మహిళ రెచ్చిపోయారు. సదరు వ్యక్తితో తీవ్ర ఘర్షణ పడ్డారు.