WorldWonders

పిల్లలతో సహా దుబాయి రాణి పరార్

Dubai Kings Wife Princess Haya Al Hasan Escapes To London With Kids

దుబాయ్ రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(69) భార్య ప్రిన్సెస్ హయా అల్ హుస్సేన్(45) ఎవరికీ తెలియకుండా దుబాయ్ నుంచి లండన్‌కు ఎస్కేప్ అవడం సంచలనం అయింది. ఇటీవల భర్త షేక్ మహమ్మద్‌తో తెగదెంపులు చేసుకున్న హయా రూ. 241 కోట్ల ఆస్తితో చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లిపోయింది. ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా హయా తీసుకువెళ్లిపోయింది. దీనిపై షేక్ మహమ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హయా చేసింది మోసమని, ఎవరికి కోసం లండన్ వెళ్లావ్ అంటూ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా మండిపడ్డారు. జర్మనీకి చెందిన ఓ డిప్లమాట్ హయా లండన్‌కు వెళ్లేందుకు సహాయపడినట్టు తెలుస్తోంది. తనకు జర్మనీలో ఆశ్రయం కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని హయా కోరినట్టు వార్తలొస్తున్నాయి. కాగా, హయా జోర్డన్ రాజుకు హాఫ్ సిస్టర్ అవుతుంది. 2004లో షేక్ మహమ్మద్‌తో ఆమెకు వివాహం జరిగింది. దుబాయ్‌లో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందనే ఈ పని చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అటు లండన్ ప్రభుత్వం కాని, ఇటు దుబాయ్ ప్రభుత్వం కాని ఇప్పటివరకు స్పందించలేదు. గతేడాది షేక్ మహమ్మద్ కూతురు ప్రిన్సెస్ లతిఫా ఇలానే దేశాన్ని విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఆమెను ఇండియన్ కోస్ట్‌లో పట్టుకున్నారు.