Business

దుబాయిలో రూపాయిలు ఖర్చు పెట్టుకోవచ్చు

You can now use your rupee currency in Dubai

దుబాయ్ ఎయిర్పోర్టుల్లోని డ్యూటీ ఫ్రీ (సుంకాలు లేని) షాపుల్లో షాపింగ్ చేయాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్. ఈ దుకాణాల్లో ఇక మన రూపాయలు కూడా చెల్లుబాటవుతాయి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. యూఏఈలోని అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లోని మూడు టెర్మినళ్లలో ఈ సదుపాయం లభిస్తోంది. రూ.100 నుంచి రూ.2,000 విలువైన ఏ వస్తువునైనా భారతీయులు రూపాయలతో కొనుగోలు చేయవచ్చు.