DailyDose

దుబాయ్ లో భారతీయులకు జాక్ పాట్-తాజావార్తలు–07/10

Indians Win Jackpot Lottery In Dubai-Daily Breaking News - July 10 2019

* దుబాయ్లో నివసిస్తున్న ఇద్దరు భారతీయులను అదృష్టం వరించింది. ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్’ లాటరీలో వారు మంగళవారం సుమారు రూ.7 కోట్ల చొప్పున గెల్చుకున్నారు. లాటరీ విజేతల్లో.. జయ గుప్తా(71) దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు. రవి రామ్చంద్ బచని(37) దుబాయ్లో వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు.
* టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రాపై ఐసిసి చీఫ్ రిచర్డ్‌ సన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్ ఎంతో బాగుందన్నారు. భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో బుమ్రాదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. పిచ్ నుంచి సహకారం లేకున్నా అతను చెలరేగుతున్న తీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన బుమ్రాదే అనడంలో సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో అతను మరింత రాటుదేలదడం ఖాయమన్నారు. ప్రపంచకప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుందన్నారు.వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు అందనంత దూరంలో నిలిచిందన్నారు. ఇదే జోరును కొనసాగిస్తే ట్రోఫీని సాధించడం భారత్‌కు కష్టం కాదన్నారు. ఇక, ప్రపంచకప్‌లో వరుణుడి ప్రభావంపై స్పందిస్తూ ఈ విషయంలో తాము చేసేదేమీ లేదన్నారు. ప్రకృతి ముందు ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఇక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్నాయన్నారు. దీంతో సెమీస్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయమన్నారు.
* రూ.2000 నోటును ముద్రించడానికి రూ.3.53 ఖర్చు అవుతున్నదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఆర్బీఐకి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే ముద్రిస్తున్న రూ.2000నోటుకు 2017-18లో రూ.4.18 ఖర్చుయ్యిందని, 2018-19 నాటికి ఈ ఖర్చు రూ.3.53కు తగ్గిందని పేర్కొంది. అదే విధంగా రూ.500 నోటు ముద్రణకు 2017-18లో రూ.2.39 ఖర్చు కాగా, 2018-19 నాటికి రూ.2.13కు తగ్గిందని వెల్లడించింది. రూ.200 నోటు ముద్రణకు 2017-18లో రూ.2.24 ఖర్చు అయ్యిందని, 2018-19 నాటికి ఈ ఖర్చు రూ.2.15కు తగ్గిందని తెలిపింది. రూ.500, రూ.200 నోట్లను సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ముద్రిస్తున్నదని కేంద్రం వెల్లడించింది. ఇక్కడ ముద్రణ అయ్యే రూ.500 నోటుకు 2017-18లో రూ.3.375 ఖర్చు కాగా 2018-19లోనూ అంతే ఖర్చు అవుతున్నదని పేర్కొంది. రూ.200 నోటుకు 2017-18లో రూ.3.12 ఖర్చు కాగా 2018-19లోనూ అంతే ఖర్చవుతున్నదని తెలిపింది.
* భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో సోమవారం అర్ధరాత్రి సమయంలో టీఆర్ఎిస్నే0త, మాజీ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్‌‌ చేశారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని బెస్తకొత్తూరులోని శ్రీనివాసరావు ఇంట్లోకి ప్రవేశించిన సాయుధులైన నక్సల్స్ మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతని కుమారుడు ప్రవీణ్కు మార్‍, భార్య దుర్గలు నక్సల్స్‌‌ను అడ్డుకొని వదిలేయాలంటూ ప్రాధేయపడ్డారు. వారిద్దర్ని కూడా కొట్టి తమ వెంట తీసుకెళ్లారు. ప్రవీణ్కుూమార్ తలకు గాయాలయ్యాయి.
* లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు షాద్ నగర్ లోని కొందుర్గు మండల వీఆర్వో అంతయ్య. రూ. 8 లక్షలు డిమాండ్ చేసి రూ. 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి రూ. 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు వీఆర్వో అంతయ్య. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్న బాధితులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. దీంతో పథకం ప్రకారం విఆర్ఓ అంతయ్యను డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టించారు బాధితులు.
* భారత స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌ మహిళల వంద మీటర్ల పరుగు విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇటలీలోని నేపుల్స్‌లో జరుగుతున్న 30వ వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో మంగళవారం ఆమె ఈ ఘనతను సాధించింది.
* ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ కేవలం 23 మంది సీట్లను మాత్రమే దక్కించుకుంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీకి , టీడీపీ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇస్తున్నారు వైసీపీ నేతలు . ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు పై అనర్హత వేటు వెయ్యాలని , వారి ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, వల్లభనేని వంశీకి కూడా షాక్ ఇచ్చారు వైసీపీ నేత వెంకటరావు .
* తాడేప‌ల్లి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్నిరేషన్ డీలర్లు నేడు ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం నివాసం పరిసరాల్లో నిషేదాజ్ఞలు విధించారు. తాడేపల్లిలో పోలీసు చట్టం అమల్లో ఉందని అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. తాడేపల్లిలో ఆందోళనలు నిర్వహించవద్దని అన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే జగన్ నివాసం వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిరంతర పరిశీలన, భద్రతా బలగాలతో పాటు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
* తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరపడం విదితమే. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. కాగా, చంద్రబాబుకు భద్రత నిమిత్తం ప్రస్తుతం ఓ డీఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్ల మాత్రమే కేటాయించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని, ఆయన భద్రత కుదింపుపై పున:సమీక్షించాలని కోరుతున్నారు. అయితే, చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలో స్పష్టం చేయడం గమనార్హం
* డయ్యూ, డామన్ బీచ్‌లలో ఈత కొట్టడాన్ని నిషేధిస్తూ పోలీసులు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాకాలంలో సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యగా సముద్రంలో ఈతకొట్టడం, స్నానం ఆచరించడాన్ని నిషేధించినట్లు డయ్యూ జిల్లా ఎస్పీ హరీశ్వర్ స్వామి చెప్పారు.
* నైరుతి రుతుపవనాల ప్రభావం కోస్తా, రాయలసీమలపై నామమాత్రంగానే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం లేకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసినా రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంది. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతిలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రుతుపవనాలు చురుకుగా మారేంత వరకు ఎండలు కొనసాగుతాయని, వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణుడు ఒకరు తెలిపారు.అయితే రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. స్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
* గత అసెంబ్లీ సమావేశాల కంటే భిన్నమైన మార్పులు ఉంటాయన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గటే నిర్ణయాలు తీసుకుంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సారీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించనున్నారు.15 వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సెషన్ ప్రారంభానికి ఒకరోజు ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
* ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడమే లక్ష్యంగా తెలుగుదేశం శాసనసభాపక్షం ఇవాళ భేటీ కానుంది. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై జరుగుతున్న దాడులకు నిరసన తెలపడం… రైతు సమస్యలను లేవనెత్తే దిశగా ప్రతిపక్షం పావులు కదుపుతోంది. అధికార పార్టీ జారీ చేసే శ్వేతపత్రాలకు దీటుగా కౌంటర్ పత్రాలను జారీ చేయటం… తమ ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం, దాడులపై శాసనసభలో ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వనుంది.
*గోదావరి నీటి మళ్లింపుపై తెలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుల మధ్య మంగళవారం హైదరాబాద్లో జరిగిన భేటీలో రెండు ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు తమ వాదనలను వినిపించారు.
*కీలకమైన సెమీస్ పోరులో టీమ్ ఇండియా అదరగొట్టింది. మంగళవారం సెమీఫైనల్లో అద్భుతమైన బౌలింగ్తో కివీస్ను కట్టిపడేసింది. కానీ వరుణుడే అడ్డుపడ్డాడు.
*కొత్తగా నిర్మించతలపెట్టిన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తన వాదనను బలంగా వినిపించింది. ఇప్పుడున్న భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని నివేదించింది. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం చేపట్టబోయే ప్రాంతంలో ఎర్రమంజిల్ భవనం కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో మంగళవారం వేర్వేరు కౌంటర్లు దాఖలు చేసింది.
*భవిష్యత్తులో తలెత్తబోయే ముప్పును తప్పించుకునేందుకే వ్యాపారి రామ్ప్రసాద్ను ప్రత్యర్థులు అంతమొందించారా? ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ పరిణామాలు, వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, కేసుల భయం ఆ దిశగా నిందితులను ప్రేరేపించిందా? పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్న నిజాలు ఆ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి.
*అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వ అధికారిపై సీబీఐ కొరడా ఝుళిపించింది. సుదీర్ఘకాలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో సహాయ సంచాలకుడి(ఏడీ)గా పనిచేసి ప్రస్తుతం జీఎస్టీలో విధులు నిర్వర్తిస్తున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ (బి.ఎస్.గాంధీ)పై హైదరాబాద్ సీబీఐ డీఐజీ చంద్రశేఖర్ మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేశారు.
*ప్రధాన రైల్వేస్టేషన్ల నిర్వహణ, కొన్ని రకాల సేవల విషయంలో ప్రైవేటు రంగం అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా రైల్వేశాఖ చేతిలో ఉన్న ప్లాట్ఫాం టికెట్ల విక్రయాలు, పారిశుద్ధ్యంతోపాటు పార్కింగ్ వంటి సేవలను గుర్తించిన స్టేషన్లలో ప్రైవేటుకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
*భాజపాకు చెందిన ఎంపీలంతా తమ నియోజకవర్గాల పరిధిలో 150కి.మీ. మేర పాదయాత్రలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి సర్దార్ వలభ్భాయి పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీ వరకూ ఈ పాదయాత్రలు సాగాలని కోరారు.
*రాష్ట్ర సచివాలయ శాఖల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. బూర్గుల రామకృష్ణారావు భవన్ సాధారణ పరిపాలన శాఖ స్వాధీనంలోకి వచ్చింది. పలు శాఖల దస్త్రాలను మంగళవారం బీఆర్కే భవన్కు చేర్చారు.
*బీటెక్ పూర్తయిన అమ్మాయిలకు తాజా సాంకేతికతపై ఉమెన్ ఇంజినీర్స్(ఉయ్) పేరిట టాలెంట్ స్ప్రింట్ సంస్థ..శిక్షణ ఇస్తోంది. దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 83 విశ్వవిద్యాలయాల పరిధిలోని 7,276 మంది పోటీపడ్డారు. వారిలో తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ నుంచి అధికంగా అభ్యర్థనలు అందాయి.
*రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్ గ్రామంలో మద్యాన్ని నిషేధిస్తూ పాలకవర్గం మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఊళ్లో ఎవరూ మద్యం క్రయవిక్రయాలు చేయరాదని, తాగకూడదని, ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని నిర్ణయించింది.
* రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది విశ్వవిద్యాలయాలకు నూతన ఉపకులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్సిటీలకు ముగ్గురు సభ్యులతో కూడిన అన్వేషణ కమిటీలను నియమిస్తుంది.
*మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ మీదుగా నడిచే ఆరు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే జులై 31 వరకు రద్దు చేసింది. ఇది బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. మణుగూరు – కాజీపేట మధ్య ప్యాసింజరు రైళ్లు (57657/58), డోర్నకల్ జంక్షన్- భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) మధ్య నడిచే రైళ్లను (57145/46) పూర్తిగా రద్దు చేశారు.
*వివిధ దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ మధ్య, పశ్చిమ మండలాల పరిధుల్లో నివసిస్తున్న పలువురు విదేశీయుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఇక్కడి విదేశీ ప్రాంతీయ కార్యాలయ బృందాలు మంగళవారం పోలీసులతో కలిసి రంగంలోకి దిగాయి. సోమాలియా, సూడాన్, సిరియా వంటి దేశాలకు చెందిన 92 మంది పత్రాలు సవ్యంగా లేవని కనుగొన్నారు. 61 మందిని మల్లేపల్లిలోని ఫంక్షన్హాలుకు తరలించి విచారించారు. పాసుపోర్టు, వీసా, ఇతర పత్రాల తనిఖీలయ్యాక వివరాలు నమోదు చేసుకున్నారు.
*రాష్ట్రంలో వచ్చే ఆరు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడ మాత్రం కొద్దిపాటి వర్షాలు కురుస్తాయని సూచించింది.
* రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రాంత ప్రచారకుల సమావేశాలు ఈనెల 11 నుంచి 13 వరకు గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పరిధి సంఘసంచాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు.
* 2021లో జరగనున్న జనాభా లెక్కింపునకు సన్నాహకంగా ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకూ దేశవ్యాప్తంగా నమూనా జనగణన జరగనుంది. ఈ మేరకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్లో ప్రచురిస్తూ ఉత్తర్వులిచ్చింది.
* కియా కార్ల పరిశ్రమ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.. వాటిని అరికట్టాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.