DailyDose

రవిప్రకాష్‌కు హైకోర్టు బెయిలు-నేరవార్తలు-07/12

High Court Grants Bail For Ravi Prakash - Daily Crime News - July 12 2019

*టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లపై రవిప్రకాష్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.తనపై నమోదైన కేసుల విషయమై గత మాసంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.
* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో.. ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
* కవిటిగ్రామీణం మండలంలోని బెలగాం సమీపంలో ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌ మృతిచెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
* గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని రామకృష్ణ మిషన్ స్కూల్ కు చెందిన 20 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం అక్షయ పాత్ర భోజన పథకంలో భాగంగా పప్పు ,పచ్చడి తిన్న పిల్లలకు.. అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలయ్యాయి. చిన్నజీఆయర్ స్వామి ట్రస్ట్ ఆశ్రమానికి చెందిన రామకృష్ణ మిషన్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్ యాజమాన్యం వెంటనే వారందరిని తాడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు
* ఆళ్ళగడ్డ చాగలమర్రి జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా కరీంనగర్, సిద్దిపేట్ జిల్లాలకు చెందిన వారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సిద్ధిపేట్ నుంచి వీరు బయలు దేరారు. మహానందిని దర్శించుకుని కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి వెళ్తుండగా టైర్ పగిలి బస్సు బోల్తాపడింది. దీంతో వేగంగా స్పందించిన స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
* మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిరుమలాపురంలో ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఇద్దరు చిన్నారులు చిత్తానూరి సూర్యతేజ (8), విశాల్ తేజ(5) తిరుమలాపురంలోని మర్రికుంటలో ఈత కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు చిన్నారులిద్దరూ కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు చిన్నారుల మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటయ్యాయి. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు 2019 మోటర్‌‌‌‌ వెహికిల్స్‌‌ సవరణ బిల్లులో ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీ గురువారం లోక్‌‌సభలో చెప్పారు.
* పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని పంజాబ్‌‌‌‌‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో గురువారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. క్వెట్టా వెళ్తున్న అక్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ సాధిఖాబాద్‌‌‌‌‌‌‌‌లోని వాల్హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ దగ్గర్లో ఎదురుగా వస్తున్న గూడ్స్‌‌‌‌‌‌‌‌ రైలును గుద్దడంతో 16 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 80 మంది గాయపడ్డారు.
* పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్సు రైలును ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టడంతో 16 మంది మరణించారు. 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురువారం పంజాబ్‌లోని వాల్హర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది.
*ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురుగులమందు తాగి ఇద్దరు వివాహితులు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగులమందు తాగిన వారిలో వ్యక్తి మృతి చెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్‌లోని మధుబనిలో చోటుచేసుకుంది.
*కొల్లూరు మండలం దోనెపూడిలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అన్న వరుస యువకుడు అత్యాచారానికి పాల్పడటం సంచలనం రేకిత్తిస్తోంది. తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన మైనర్ బాలికపై అన్న వరుస అయ్యే సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు.
*ఖమ్మంజిల్లాలోని రఘునాథపాలెంలో పురుగులమందు తాగి ఇద్దరు వివాహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో వ్యక్తి మృతి చెందాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
*హైదరాబాద్ నగరంలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.45వేల నగదు, టీవీ, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
*హౌసింగ్ డీఈఈ ఆఫీసులోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. కర్నూలుకు చెందిన హౌసింగ్ డీఈఈ వాసుదేవరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాసుదేవరావును చిత్తూరుకు బదిలీ చేయడంతో ఆయన ఆఫీసులోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో సహ ఉద్యోగులు వాసుదేవరావును అడ్డుకున్నారు.
*హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి మద్యం సేవించి తెల్లవారు జామున తాజ్ మహల్ హోటల్ 2వ అంతస్తు పై నుంచి దూకి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
*సరదాగా ఫీట్లు చేస్తూ ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వృద్ధుడిని కారు ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్టంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల నుంచి ఇబ్రహీంపట్నంకు ఓ వృద్ధుడు(65) ద్విచక్రవాహనంపై కూరగాయల లోడుతో వెళ్తున్నాడు.. వృద్ధుడు ద్విచక్రవాహనంపై సరదాగా ఫీట్లు చేస్తూ వాహనం నడుపుతున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి అదే మార్గంలో వస్తున్న ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
*ఇద్దరు వ్యక్తులు పెద్దఎత్తున బంగారం పట్టుకొని వెళ్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్సు పోలీసులు విశాఖ రైల్వేస్టేషన్ రహదారిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అబ్దుల్ రెహమాన్, షేక్ అబీద్ల వద్ద ఉన్న కిలో బంగారం కడ్డీ, రూ.45,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
*చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురై శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బహాడపల్లికి చెందిన రైతు కొండే దానయ్య (50) ఆత్మహత్య చేసుకొన్నాడు.
*అనాథలకు, నిరుపేదల పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మదర్సాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వెలుగులోకి వచ్చింది.
*యాత్రికుల బస్సు డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 25 మంది గాయపడ్డారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్దబోధనం గ్రామ సమీపంలో 40వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు కోసం ఒక యువకుడిని దారుణంగా హత్యచేశారు. మృతదేహాన్ని యానగుంది- కొడంగల్ ప్రధాన రహదారి వద్ద పొలాల్లో పడేసి పరారయ్యారు.
*బాసర ఆర్జీయూకేటీలో లైంగిక వేధింపులు, పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో బాసర పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
*ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి తెగబడ్డ కామాంధుడికి భోపాల్ కోర్టు ఒకటి మరణ శిక్ష ఖరారు చేసింది. డీఎన్ఏ పరీక్షల నివేదికలు, 30 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన ప్రత్యేక జడ్జి(పోక్సో కేసులు) కుముదిని పటేల్ కేవలం 32 రోజుల్లోనే ఈ కేసులో తీర్పు వెలువరించారు.
*మొక్కల చాటున రవాణా చేస్తున్న 962.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
*అమెరికాలో తన కుమారుడి చదువుకు సన్నాహాలు చేస్తున్న కారణంగా తాను పోలీసు విచారణకు హాజరు కావడం లేదని సినీ నటుడు శివాజీ గురువారం తమకు ఈమెయిల్ చేసినట్లు సైబర్ క్రైం పోలీసు అధికారులు పేర్కొన్నారు.
*పక్కింటి మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా ఫోన్లో వీడియోలు తీసేందుకు యత్నించాడని వ్యక్తిని బుధవారం ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
*అవినీతి కేసులో అరెస్టయిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు రిమాడ్ విధించింది. వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు బుధవారం హయత్నగర్లోని ఆమె నివాసంలో సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
*పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ స్నేహితురాలి(16)పై అత్యాచారం చేసిన 17 ఏళ్ల యువకుడికి స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
*అనంతపురం జిల్లా రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డులో విత్తన వేరుసెనగ కాయల కోసం వచ్చిన వేపరాళ్లకు చెందిన ఉప్పర ఈశ్వరప్ప(48) అనే రైతు బుధవారం ప్రాణాలొదిలారు.
*మద్యం మత్తులో తండ్రి గొంతు నులిమి చంపిన కుమారుడి ఉదంతమిది. పింఛను సొమ్ము ఇవ్వలేదని కుమారుడు గొంతు నులమగా.. చికిత్స పొందుతూ వృద్ధుడు చనిపోయిన ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడులో చోటుచేసుకుంది.
*మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం పంచాయతీ మిర్యాలపెంట గ్రామానికి చెందిన 15 మంది గిరిజనులను ఈ నెల 12వ తేదీన హాజరుపరచాలని పోలీసులను బుధవారం హైకోర్టు ఆదేశించింది.
*కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖను మోసగించేందుకు యత్నించిన 21 ఏళ్ల అసోం యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. అప్పటికే వివిధ శాఖల అధికారులను బురిడీ కొట్టించి రూ.4 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు.
*మూడు రాష్ట్రాల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు నక్సలైట్లు మధ్యప్రదేశ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. వీరిలో ఒకరు మహిళ. నెవార్వాహి గ్రామంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించారు.
* అధిక వడ్డీ ఆశ చూపి భారీ మొత్తాలను దండుకున్న కేసులో.. నిందితురాలు నౌహీరా షేక్ను కర్ణాటక పోలీసులు బుధవారం హోస్పేట జైలుకు తరలించారు. ట్రాన్స్ఫర్ వారెంటుపై ఆమెను అక్కడికి పంపించామని చంచల్గూడ మహిళా కారాగార అధికారులు వెల్లడించారు.
* నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలి బెంగళూరులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పులికేశినగర పోలీసు ఠాణా పరిధిలోని హచిన్స్ రహదారిలో నిర్మాణ దశలో ఉన్న నాలుగంతస్తుల అపార్ట్మెంట్ (ఆది అంబాల్) దాని పక్కనే నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై ఒక్కసారిగా ఒరిగిపోయింది.
*ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో చోటుచేసుకుంది.
* నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలి బెంగళూరులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు
* ఒకరి తర్వాత ఒకరుగా ఇంటి వద్దనున్న బావిలో దిగిన ముగ్గురు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. కుమురం భీం జిల్లా కౌటాల మండలంలో బుధవారం జరిగిన ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
*లంచం తీసుకుంటూ ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ వలకు చిక్కాడు. డిజిటల్ పాసుపుస్తకం కోసం ఆశ్రయించిన రైతునుంచి రూ.4లక్షలు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో వెలుగులోకి వచ్చింది.
*హీరా గ్రూప్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ను బళ్లారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నమోదైన కేసులో దర్యాప్తు కోసం.. ఆమెను చంచల్గూడ మహిళా జైలు నుంచి తీసుకెళ్లారు. నాంపల్లి న్యాయస్థానంలో పీటీ వారెంట్ సమర్పించి న్యాయస్థానం అనుమతి మేరకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బళ్లారి తీసుకెళ్లారు.
*గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల హత్యకు గురైన తెదేపా నేత ఉమా యాదవ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
*ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి కుమారుడు ఆమంచి రాజేంద్రపై చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదుచేశారు.
*మద్యం వ్యసనానికి బానిసైన కన్నతండ్రి.. ఏడు నెలల పసికందును అమ్మేసిన హృదయవిదారక ఘటన ఒడిశా నవరంగ్పూర్లో జరిగింది.
*కడప జిల్లాలోని రాయచోటి-పులివెందుల ప్రధాన రహదారిపై లక్కిరెడ్డి పల్లి వద్ద ప్రమాదం జరిగింది. డీసీఎం, ద్విచక్రవాహనం ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందగా..మరొకరికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం కారస్గుత్తిలో గురువారం తెల్లవారుజామున తల్లీకొడుకు హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారస్గుత్తికి చెందిన సుజాత(35), ఆమె కుమారుడు దినేశ్రెడ్డి(4)లపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేశారు.
*పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో మహిళలపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. సామన్య మహిళలే కాదు.. ప్రముఖులు సైతం ఈ భయానక ఘటనలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ బెంగాలీ నటిని ఉబర్ డ్రైవర్ క్యాబ్ నుంచి తోసేశాడు. అంతటితో ఆగకుండా ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రముఖ బెంగాలీ టీవీ నటి స్వస్తికా దత్తాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆ భయానక అనుభవాన్ని ఆమె ఫేస్బుక్ పోస్ట్లో పంచుకున్నారు.
*హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనలో సాయికృష్ణ (17) అనే బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
*మద్యం మత్తులో తండ్రి గొంతు నులిమి చంపిన కుమారుడి ఉదంతమిది. పింఛను సొమ్ము ఇవ్వలేదని కుమారుడు గొంతు నులమగా.. చికిత్స పొందుతూ వృద్ధుడు చనిపోయిన ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడులో చోటుచేసుకుంది.
*ఒక్క రూపాయికి కుళ్లిన గుడ్డు కొని మధురై జిల్లాలో కొన్ని దుకాణాల్లో కేకులు తయారు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. మధురైలో కేకు తయారీకి కుళ్లిన గుడ్లను విక్రయిస్తున్న గోదామును ఆహార భద్రత అధికారులు సీజ్ చేశారు.