DailyDose

పొగాకు బోర్డు ఛైర్మన్‌గా వై.రఘునాథబాబు-తాజావార్తలు–07/12

Y Raghunadha Babu Appointed As Tobacco Board Chairman

*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబుకు బీజేపీ కీలక పదవి కట్టబెట్టింది. పొగాకు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రఘునాథబాబును చైర్మన్ గా నియమిస్తూ కేంద్రపరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. రఘునాథబాబు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. గత కొంతకాలంగా పొగాకు బోర్డుకు చైర్మన్ లేరు. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు చైర్మన్ గా ఇన్ చార్జి చైర్మన్ కే సునీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రఘునాథబాబును చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రప్రభుత్వం. రెండు రోజుల్లో రఘునాథబాబు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
* జార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో మావోయిస్టులు 16 వాహనాలను తగులబెట్టారు. అదేవిధంగా ఆరుగురి కూలీలపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడింది తామేనని జార్ఖండ్‌ జన్‌ముక్తీ పరిషత్‌(జేజేఎంపీ) పేర్కొంది. మావోయిస్టులు మొదటగా థోరి రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు.
* అయోధ్య మందిర్ – మసీద్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని పిటిషనర్ గోపాల్ సింగ్ విశారద్ తరఫున సీనియర్ న్యాయవాది పరాశరణ అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ పరిష్కారం చూపలేదనడం సబబు కాదని మరో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ నచ్చని కొంతమంది ఇలా ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్ ధావన్ కోర్టులో చెప్పారు.ఐతే… జులై 25వ తేదీ నుంచి అయోధ్య వివాదంపై రోజువారీ విచారణ చేస్తామని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. జూలై 18 లోపు అప్పటివరకు ఉన్న వాస్తవ నివేదిక ఇవ్వాలని మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది.
* నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో 15వతేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌ – 2 ప్రయోగం జరగనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఓ ప్రకటనలో సూచించారు.
* మాజీ మంత్రి వివేకా హత్య కేసును విచారణ మరింత వేగవంతం చేసిన సిట్ బృందం..మరోమారు ఎర్ర గంగిరెడ్డి ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్న డిఎస్పీ వాసుదేవన్…ఎర్ర గంగిరెడ్డి కి నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్..
* ఢిల్లీలో సీనియర్ లాయర్ల ఇళ్లలో CBI సోదాలు చేసింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచే సోదాలు కొనసాగాయి. సీనియర్ లాయర్లు.. ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ ఇల్లు, ఆఫీస్ లలో అధికారులు తనిఖీలు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని వారు ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. ఆనంద్ గ్రోవర్, అతని NGO లాయర్లు విదేశాల నుంచి నిధులు సేకరించినట్టు కేసు నమోదు అయింది.
* మాజీ అడిషనల్‌‌‌‌ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌, సుప్రీంకోర్ట్‌‌‌‌ ఆడ్వకేట్‌‌‌‌, మానవ హక్కుల నేత ఇందిరా జైసింగ్‌‌‌‌, ఆమె భర్త, లాయర్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ గ్రోవర్‌‌‌‌ ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ గురువారం సోదాలు జరిపింది. నిజాముద్దీన్‌‌‌‌లోని ఇందిరా ఇంట్లోనూ ఆనంద్‌‌‌‌ గ్రోవర్‌‌‌‌ నడుపుతున్న ఎన్జీవో..లాయర్స్‌‌‌‌ కలెక్టివ్‌‌‌‌ ఆఫీసుఉన్న జంగ్‌‌‌‌పురాలోనూ సోదాలు జరిగాయి. దీంతోపాటు ముంబైలో ఉన్న లాయర్స్‌‌‌‌ కలెక్టివ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లోనూ గురువారం ఉదయం ఐదు గంటల నుంచే సోదాలు చేసినట్టు సీబీఐ అధికారులు చెప్పారు. మరోవైపు మానవ హక్కుల రంగంలో తాము పనిచేస్తున్నందు వల్లే తనను, భర్త ఆనంద్‌‌‌‌ గ్రోవర్‌‌‌‌ను సీబీఐ టార్గెట్‌‌‌‌ చేసిందని ఇందిరా జైసింగ్‌‌‌‌ ఆరోపించారు.
* భువనగిరి పట్టణంలో మహిళ కిడ్నాప్‌ కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బుధవారం ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు భావనను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జగదేవపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది
* రైతు కుటుంబంలో పుట్టినందుకు సంతోషంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. విజయనగరం జిల్లా ఎల్. కోట మండల కేంద్రంలో జరిగిన హెరిటేజ్ రైతు సంక్షేమ నిధి మెగాక్యాంప్‌నకు ఆమె ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశానికి రైతు వెన్నుముక అని చెప్పుకోవటమే గాని వాళ్ల కష్టాలు మాత్రం తీరటం లేదని ఆమె అన్నారు.
* చిత్తూరు జిల్లాలో కొత్తి మీర ధరకు రెక్కలచ్చాయి. రైతు మార్కెట్‌లో రూ.5 నుండి రూ.10 కు దొరికే కొత్తిమీర కట్ట, జిల్లాలో రికార్డు స్థాయిలో కేజీ ధర రూ.120 నుండి రూ.200 పలుకుతుంది. వర్షాలు లేక కొత్తిమీర సాగుకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో కొత్తిమీర ధర విపరీతంగా పెరిగింది. కావాలనే దళారులు కొత్తిమీర ధరను పెంచారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
* ఏపీ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో స్వల్ప మార్పు జరిగింది. శాసనసభలో మధ్యాహ్నం 12.22 గంటలకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలోనూ మధ్యాహ్నం 12.22 గంటలకు మండలిపక్ష నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాసనమండలిలో ప్రవేశపెడతారు. ఆ వెంటనే వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మండలిలో పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు. సోదరుడి హఠాన్మరణంతో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్ట లేకపోతున్నారు
* గత నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన, టీఆర్ఎస్ నేతను మావోయిస్టులు వదిలేశారు. చర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు నల్లూరి శ్రీనివాస్‌ను మావోయిస్టు నక్సలైట్లు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయన జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. కాగా. శుక్రవారం ఉదయం శ్రీనివాస్‌ను మావోయిస్టులు వదిలేయడంతో ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది
* నవరత్నాల అమలే కీలక అజెండాగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. మొత్తం రూ.2లక్షల 40వేల కోట్ల మేర ప్రతిపాదలు ఆర్థిక శాఖ స్వీకరించింది. వైకాపా ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపు రూ.66వేల కోట్లకు పైగా ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
* నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో 15వతేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌ – 2 ప్రయోగం జరగనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఓ ప్రకటనలో సూచించారు.
* హౌసింగ్ డీఈఈ ఆఫీసులోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. కర్నూలుకు చెందిన హౌసింగ్ డీఈఈ వాసుదేవరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాసుదేవరావును చిత్తూరుకు బదిలీ చేయడంతో ఆయన ఆఫీసులోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో సహ ఉద్యోగులు వాసుదేవరావును అడ్డుకున్నారు.
* ప్రజావేదిక వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్ రాడ్స్ కట్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా వ్యాపించడంతో పక్కన ఉన్న ఫైబర్ రేకులకు ఒక్కసారిగా అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బందిరంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి పక్కనే చంద్రబాబు నివాసం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైంది.
*ఎయిర్ కెన‌డా విమానం కుదుపుకు గురైంది. దీంతో ఆ విమానంలో ప్ర‌యాణిస్తున్న 37 మంది తీవ్ర గాయ‌ప‌డ్డారు. గాలిలో ఎగురుతున్న స‌మ‌యంలోనే.. విమానం భారీగా ఊగిపోయింది. దీంతో దాన్ని ఎమ‌ర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలో మొత్తం 284 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వాంకోవ‌ర్ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానాన్ని అత్య‌వ‌స‌రంగా హ‌వాయిలో దించేశారు. గాలిలోనే కుదుపుకు గురికావ‌డంతో.. విమాన రూఫ్‌కు ఢీకొన్న‌ట్లు ప్ర‌యాణికులు చెప్పారు. కొంద‌రు గాలిలో తేలిపోయారు.
*మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. రేవతి నివాసం వద్ద నుంచి స్టేషనుకు తరలించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*చిత్తూరుజిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం వెంగమారిపల్లిలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొత్తం  ఏనుగులు గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ పంటపొలాల మీద పడి ధ్వంసం చేశాయి. దీంతో కోసుటమోటా పంటలు ధ్వంసం అయ్యాయి. అంతేగాక పంటకు వేసిన డ్రిప్ సిస్టమ్స్‌తోపాటు పైప్ లైన్లను కూడా ధ్వంసం చేశాయి. ఏనుగులు సృష్టించిన భీభత్సం వల్ల దాదాపు మూడు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
*తెలంగాణ సచివాలయ శాఖలను ఏర్పాటు చేస్తున్న బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కేఆర్) భవన్ చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు కానుంది. ఆ ప్రాంతమంతా పోలీసుల పహారాలోకి వెళ్లబోతోంది.
*కొత్త పురపాలక చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న ప్రత్యేక సమావేశాలలో శాసనసభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. శాసనసభలో బలాబలాలు మారడంతో ఆ మేరకు సభ్యుల స్థానాల కూర్పు మారనుంది.
* బాసరలోని రాజీవ్గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) చట్టంలో కీలక మార్పు చేయనున్నారు. గవర్నరే కులపతిగా వ్యవహరించేలా చట్టాన్ని మార్చనున్నారు. విద్యాశాఖ పరిధిలో మొత్తం 11 విశ్వవిద్యాలయాలుండగా పదింటికి కులపతిగా గవర్నర్ ఉంటారు.
*సుప్రీంకోర్టు ఆదేశాలు, శాసనసభాపతి స్పందనల నేపథ్యంలో అసమ్మతి నేతలు 11 మంది గురువారం సాయంత్రం ముంబయి నుంచి బెంగళూరుకు తరలివచ్చారు. స్పీకర్ రమేశ్కుమార్కు స్వయానా రాజీనామా పత్రాలను సమర్పించారు.
*జాతీయ లోక్అదాలత్లో భాగంగా ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సంతోష్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్ కేసులతోపాటు జరిమానా విధించదగ్గ క్రిమినల్ కేసులను ఇందులో పరిష్కరించుకోవచ్చన్నారు.
*ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) ద్వారా ఎంపికైన అభ్యర్థులు మొత్తం 2,058 మందికి ఈనెల 13, 14 తేదీల్లో నియామక పత్రాలు అందించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లు(హిందీ తప్ప), పీఈటీ ఉర్దూ, మరాఠీ, ఆంగ్లం, కన్నడ, హిందీ, భాషా పండితులు తెలుగు, ఉర్దూ, మరాఠీలకు సంబంధించి పాత 10 జిల్లాల్లో 2,509 మందిని భర్తీ చేయాల్సి ఉంది.
*పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ల జాబితాల ప్రచురణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
*ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం వేలాది మంది విద్యార్థులతోపాటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు జూన్ 12తో పూర్తయ్యాయి. నెల రోజులవుతున్నా ఫలితాలపై ఇంటర్ బోర్డు అధికారులు నోరు విప్పడంలేదు.
*భారీ వర్షాలతో దెబ్బతిన్న ఒడిశాకు సింగరేణి సంస్థ రూ.కోటి విరాళంగా అందజేసింది. బుధవారం సంస్థ ఛైర్మన్ శ్రీధర్ భువనేశ్వర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిసి చెక్కును అందజేశారు.
*సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో ఆరు గిరిజన క్రీడా పాఠశాలల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలో నాలుగు బాలుర, రెండు బాలికల క్రీడా పాఠశాలల్ని కేంద్రం మంజూరు చేసింది.
* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా అమలు చేయనున్నారు. మొత్తం సీట్లలో 20 శాతం సీట్లను కళాశాలలు సొంతగా భర్తీ చేసుకునేలా యాజమాన్య కోటా కింద అవకాశం ఇవ్వనున్నారు.
*సికింద్రాబాద్-డోన్ సెక్షన్లో నియంత్రించనున్నట్లు ప్రకటించిన ఆరు రైళ్ల రాకపోకలు జులై 11, 12, 13 తేదీల్లో యథావిధిగా సాగుతాయని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటిక్యాల-మనపాడ్ స్టేషన్ల మధ్య పట్టాల మరమ్మతుల నేపథ్యంలో జులై 13 వరకు నిర్ణీతవేళల్లో పలు రైళ్ల రాకపోకల్ని నియంత్రించనున్నట్లు జూన్ 18న ప్రకటించింది.
*గత ప్రభుత్వ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎవరైనా అర్హులుంటే గుర్తించి.. వారి కుటుంబాలకు కూడా రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
*కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యబోర్డుల్లో తెలంగాణ తరఫున పరిపాలనా సభ్యునిగా సోమేష్కుమార్ నియమితులయ్యారు. గతంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్.కె.జోషి సభ్యునిగా ఉండగా, ప్రస్తుతం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సోమేష్కుమార్ సభ్యునిగా నియమితులయ్యారు
*జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఇంజినీరింగ్ అధికారులు విడతల వారీగా మూసివేస్తున్నారు. మొత్తం 85 గేట్లకు మంగళవారం 51 మూసివేయగా బుధవారం రాత్రి 19 మూసివేశారు. మిగతా గేట్లను నీటి ప్రవాహాన్ని బట్టి మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 91.6 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉంది
*సచివాలయం తరలింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఖాళీ చేసిన డీజీపీ కార్యాలయంలోకి తెలంగాణ హోం, అగ్నిమాపక శాఖలను తరలించాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం కోసం లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయ భవనాన్ని కేటాయించారు.
*హజ్ యాత్రను సులభతరం చేస్తూ అందివచ్చిన నూతన విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హాజీలకు సూచించారు. ఆన్లైన్లో హజ్ విమాన టికెట్లు పొందడంపై బుధవారం విజయవాడలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.