DailyDose

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు-వాణిజ్య–07/22

Indian Stock Markets Collapse-Today Telugu Business News-July22 2019

* టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.205, రూ.225 పేరిట రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.205 ప్లాన్‌లో కస్టమర్లకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 35 రోజులుగా నిర్ణయించారు. అలాగే రూ.225 ప్లాన్‌లో 4జీబీ డేటా లభిస్తుంది. ఇందులోనూ అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 48 రోజులుగా నిర్ణయించారు. ఇక రెండు ప్లాన్లలోనూ 600 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభనష్టాలనుంచి మరింత పతనమైన సెన్సెక్స్‌ 38వేల దిగువకు చేరింది. లంచ్‌ అవర్‌ తరువాత మరింత క్షీణించాయి.సెన్సెక్స్‌ 444 పాయింట్లు కుప్పకూలి 37893 వద్దకు చేరింది. అలాగే 11400 స్థాయిని బ్రేక్‌ చేసిన నిఫ్టీ 11300 స్థాయిని కూడా బ్రేక్‌ చేసేందుకు సిద్దంగా ఉంది. 114పాయింట్లు నష్టపోయి 11305 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతమే వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో వారాంతంలో భారీ నష్టపోయిన సంగతి తెలిసిందే. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల్లో అమ్మకాలు కనొసాగుతున్నాయి. ప్రధానంగా బాడ్‌లోన్ల బెడదతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు భారీ నష్టాలతో రెండు నెలల కనిష్టానికి చేరింది.
*భారత్లోని వినియోగదార్ల సమాచారాన్ని స్థానికంగా నిక్షిప్తం చేసేందుకు వీలుగా ప్రత్యేక డేటా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నామని టిక్టాక్, హలో యాప్ల మాతృ సంస్థ బైట్డ్యాన్స్ తెలిపింది.
*పసిడి ఆగస్టు కాంట్రాక్టు గత వారం రూ.34,897 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత దిద్దుబాటుకు లోనై రూ.34,862 స్థాయికి దిగివచ్చింది. అనంతరం తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్లు చోటుచేసుకోవడంతో తిరిగి పుంజుకుని రూ.35,409 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది.
*రాగి జులై కాంట్రాక్టు ఈవారం రూ.461.55 ఎగువన కదలాడకుంటే రూ.468.55 స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. లాంగ్ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.448 దిగువన స్టాప్లాప్ తప్పక పెట్టుకోవాలి.
*ముడి చమురు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.4,048 ఎగువన ట్రేడ్ కాకుంటే మరింత కిందకు దిగివచ్చే అవకాశం ఉంది. రూ.3,629; రూ.4,548 వరకు పడిపోవచ్చు. ఒకవేళ రూ.4,048 ఎగువన ట్రేడయితే రూ.4,078; రూ.4,203 వరకు పెరిగేందుకు ఆస్కారం ఉంది.
* ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఉద్యోగుల పదోన్నతులు, కొత్త నియామకాలు నిలిపివేసింది. రూ.50,000 కోట్ల రుణభారంతో సతమతమవుతున్న ఎయిరిండియాలో వాటా విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, నియామకాలు స్తంభింపచేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
*గట్టి పోటీ ఉన్న భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో దిగ్గజాలైన సామ్సంగ్, షామీతో పోటీ పడేందుకు చైనాకు చెందిన వివో ‘ఎస్’ సీరీస్ ఫోన్ల అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఎస్ సీరీస్ హ్యాండ్సెట్లకు బ్రాండ్ అంబాసిడర్గా సారా అలీఖాన్ను నియమించింది. రూ.15 వేల నుంచి రూ.25 వేల ధరల విభాగంలో ఎస్ సీరీస్ ఫోన్లను నిలపాలనుకుంటున్నట్టు వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ర్టాటజీ) నిపుణ్ మార్యా తెలిపారు. ఈ హ్యాండ్సెట్లు ఆఫ్లైన్లోనే ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయన్నారు. వివో బ్రాండ్లన్నింటికీ నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.
*ఆటోమొబైల్ రంగం అమ్మకాలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో ఆ కంపెనీల ఎండీల జీతాలు, పారితోషికాలు మాత్రం చుక్కలంటుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2018-19) టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బుచెక్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) కంపెనీల ఎండీ పవన్ గోయెంకా తీసుకున్న జీతాలే ఇందుకు ఉదాహరణ.
*భారత్ మాల పథకం కింద రూ.8.41 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించే రహదారి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలు సమకూర్చేందుకు ఎల్ఐసీ అంగీకరించింది. ‘ఈ ప్రాజెక్టులకు ఏటా రూ.25,000 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల రుణాలు సమకూర్చేందుకు ఎల్ఐసీ సూత్రప్రాయంగా అంగీకరించింది’ అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
*యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ స్కీమ్ ‘యూనియన్ ఫోకస్డ్ ఫండ్’ను తీసుకువచ్చింది. గరిష్ఠగా 30 స్టాక్స్ పోర్టుఫోలియోలో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ ఫండ్ను తీర్చిదిద్దింది.
*నిఫ్టీ గత వారం 11707-11399 పాయింట్ల మధ్యన కదలాడి 259 పాయింట్ల భారీ నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో 11553 వద్ద నెగిటివ్గా ముగిసింది. మార్కెట్ నష్టాలతో ముగియడం వరుసగా ఇది రెండో వారం.
*ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 4.1 శాతానికి తగ్గించింది. ఆహార ద్రవ్యోల్బణం అనుకుంటున్న స్థాయి కన్నా తక్కువగా ఉండడంతో పాటు రూపాయి బలంగా నిలవడం కూడా ఈ ఏడాది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడుతుందని ఆసియా అభివృద్ధి అంచనా (ఏడీఓ) అనుబంధ నివేదికలో పేర్కొంది.