Agriculture

పార్లమెంటులో తెలంగాణా రైతాంగ సమస్యలు ఏకరువు పెట్టిన ఉత్తమ్

MP Uttham Kumar Reddy Speaks On Telangana Farmers Problems In Parliament - పార్లమెంటులో తెలంగాణా రైతాంగ సమస్యలు ఏకరువు పెట్టిన ఉత్తమ్

తెలంగాణా రైతాంగ సమస్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే గులాబీ పార్టీ రైతు సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఆరోపించారు. తెలంగాణలో వర్షాలు లేక వ్యవసాయం ఇంకా మొదలు కాలేదని, ప్రభుత్వ సాయం కూడా పెద్దగా లేదని ఆయన వివరించారు. రైతు రుణ మాఫీ అని చెప్పిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అనేక సమస్యల్లో చిక్కుకున్నారని తెలిపారు. చాలమంది రైతులకు అప్పులు పెనుభారంగా పరిణమించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించండం దారుణమని ఆయన అభివర్ణించారు. కష్టాల్లో తెలంగాణ సేద్యం..! రోజుకు 30 మంది రైతుల ఆత్మహత్యలన్న ఉత్తమ్..!! అంతే కాకుండా రైతుల సౌకర్యార్ధం నిజామాబాద్ లో పసుపుబోర్డ్ ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమండ్ చేసారు. రైతు రుణాల విషయంలో ప్రభుత్వాలు బ్యాంకర్లతో స్నేహపూర్వకంగా వ్యవహరించే అంశంలో కేంద్రం ప్రాంతీయ ప్రభుత్వాలకు తగు సూచనలు లచేయాలని, కేంద్రం ఎంత తొందరగా చొరవ చూపిస్తే అంత తొందరగా ఆత్మహత్యలు ఆగుతాయని ఉత్తమ్ కేంద్రానికి సూచించారు. రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్య వారధిగా కేంద్రం నడుచుకుంటే రైతు సమస్యలకు తక్షణ పరిష్కార మార్గాలు దొరుకుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో అభిప్రాయ పడ్డారు. పత్తికి మద్దతు ధర 6 వేలు చేయాలి..! నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టాల టీపిసిసి ఛీఫ్..!! దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 65-70 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మంగళవారం లోక్‌సభలో వ్యవసాయ శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఉత్తమ్‌ మాట్లాడారు. దేశంలో ఏటా సగటున 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. 2017 నుంచి రైతుల ఆత్మహత్యల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం లేదన్నారు. తెలంగాణలో వేలాది రైతుల బలవన్మరణం..! బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్న ఎంపీ..!! ‘ఈ మొత్తం వ్యవహారంలో కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 30 శాతం కౌలు రైతులు ఉన్నారు. దేశంలో 2.1 కోట్ల మంది కౌలు రైతులు ఉండగా అందులో చాలా మంది బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నారు. దాంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వారికి వర్తించదు. పంట బీమా సౌకర్యం లేదు. దీంతో పంటలు నష్టపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011-12లో కౌలు రైతులకు హక్కులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి చట్టం తీసుకురావాలి’ అని విజ్ఞప్తి చేశారు. పత్తి పంటకు కనీస మద్దతు ధరను 6 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రైతుకు ఇస్తుంది 6 వేలా..? కేంద్రం రైతాంగాన్ని అవమానిస్తోందన్న ఉత్తమ్..!! పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఒక్కో రైతుకు ఏటా 6 వేల రూపాయలు అందించడంతో పెద్దగా ఒరిగేదేమీ లేదని ఉత్తమ్‌ చెప్పారు. ఇది గౌరవించడమా లేక అవమానించడమా? అని ప్రశ్నించారు. 2 ఎకరాల సాగుకు 50 వేల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుందన్నారు. ఫసల్‌ బీమా యోజన లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోలేదని, తెలంగాణలో పంట నష్టపోయిన రైతులు బీమా కోసం క్లెయిమ్‌ చేస్తే ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పారు. ఓ సంస్థ నివేదికలో 2017-18లో బీమా కంపెనీలు 3 వేల రూపాయల కోట్లు లాభపడ్డాయని తేలిందన్నారు. ఈ పథకం రైతుల కంటే బీమా కంపెనీలకే బాగా ఉపయోగపడుతోందని ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలన్నారు.