DailyDose

రేపిస్టుకు ఉరిశిక్ష పడింది-నేరవార్తలు–08/08

Rapist Sentenced To Death In Hanmakonda-Telugu Crime News Today-Aug82019-రేపిస్టుకు ఉరిశిక్ష పడింది-నేరవార్తలు–08/08

*రాష్ట్రంలో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణను 48రోజుల్లోనే పూర్తిచేసి సంచలన తీర్పు చెప్పింది వరంగల్ కోర్టు. ఈ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు వరంగల్ ఫస్ట్ అడిషనల్ జడ్జ్ జయకుమార్. ఇది క్షమించరాని నేరం అనీ… ముక్కుపచ్చలారని చిన్నారిపై రాక్షసుడిగా ప్రవర్తించి ఆమె ప్రాణాలు తీసిన నిందితుడికి బతికే హక్కే లేదని న్యాయమూర్తి చెప్పారు.
*నెల్లూరు జిల్లా కావలిలో హోటల్స్ పై దాడులు చేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ .హోటల్స్ లో కుళ్లిపోయిన మాంసం స్వాధీనం చేసుకున్న ఇన్స్పెక్టర్లు హోటల్స్ పై కేసు నమోదు.
* ఏపీలోని చిత్తూరు జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ ఓ వివాహితను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. హత్య అనంతరం ఆటో డ్రైవర్ సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
* గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవిచింది. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవిచినట్లుగా సమాచారం. మంటల్లో మూడో అంతస్తులోని చిన్నపిల్లల వార్డులో పరికరాలు దగ్ధమయ్యాయి. మూడో అంతస్తులో లోపలికి వెళ్లకుండా పొగలు కమ్ముకున్నాయి. పొగలు వ్యాపించడంతో రోగులు ఆందోళనలో ఉన్నారు.
* హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల పటేల్ నగర్‌లో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళ మెడలో నుంచి దొంగలు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*హైదరాబాద్ సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గరున్న మీడియాపాయింట్ ను ఖాళీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. మీడియాపాయింట్ ను ముందుగా ఖాళీచేయాలని ఆదేశాలు రావడంపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి.
*భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం విధించింది. పాకిస్థాన్ సినిమా థియేటర్లలో ఇకపై భారతీయ సినిమాలు ప్రదర్శించబడవని ఆ దేశ ప్రధానమంత్రికి సమాచార, ప్రచారశాఖ స్పెషల్ అసిస్టెంట్ డా. ఫిర్దౌస్ ఆశిక్ అవన్ తెలిపారు. 370 ఆర్టికల్ తిరిగి పునరుద్దరించేందుకు కశ్మీరీలకు అన్ని విధాల మద్దతు ఇస్తామని ఆమె ఈ సందర్భంగా అన్నారు.
*వరంగల్లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న కౌశిక్ పాండే (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోల్కతాలోని అవద్ ప్రాంతానికి చెందిన కౌశిక్ పాండే వరంగల్నిట్ లో ఈ సీఈ బ్రాంచ్ లో చేరాడు.
*అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామానికి చెందిన కౌలు రైతు వరుకోలు లచ్చయ్య(52) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండు సంవత్సరాలుగా రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని లచ్చయ్య వ్యవసాయం చేస్తున్నాడు. అయితే లచ్చయ్య ఆత్మహత్యకు అప్పుల బాధే కారణమని స్థానికులు చెబుతున్నారు. లచ్చయ్యకు భార్య మణెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు.
*మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడటంతో 14 మంది దుర్మరణం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30 మందితో బయల్దేరిన ఈ పడవ వరద ఉద్ధృతి ధాటికి బోల్తా పడింది. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను గురువారం బయటకి తీశారు.
*అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు నార్పల మండలం మద్దలపల్లి వద్ద రెండు మోటార్ బైకులు అదుపు తప్పి డివైడరు ను ఢీ కొట్టడంతో ఒక్కరు మృతి,ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.
* పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ఎన్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ మరోసారి అరెస్ట్ అయ్యారు. చౌద్రీ సుగర్ మిల్స్ కేసులో పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) అధికారులు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లోహోర్‌లోని కోట్ లక్‌పత్ జైల్లో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు ఆమె వెళ్తుండగా అధికారులు అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తనంత తానే ఎన్ఏబీ కార్యాలయానికి వెళ్లాలని భావించినప్పటికీ.. ఈలోగానే ఆమెను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో తన భర్త, తండ్రితో పాటు మరియం కూడా గతేడాది జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. కొద్దినెలల్లోనే ఈ ముగ్గురూ విడుదల కాగా.. అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్‌ మళ్లీ లాహోర్ జైలుకు వెళ్లారు.
*ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లకు 11 ఏళ్ల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బుధవారం తుది తీర్పు వెల్లడించారని ఏపీ ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం(టాస్క్ఫోర్స్) బాధ్యుడు ఎస్పీ రవిశంకర్ తెలిపారు.
*రైల్రోకో చేసిన కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు వారం రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 2008 జులై 7న అప్పటి ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ రామకృష్ణతో పాటు మరికొందరు సీపీఐ నాయకులు అనంతపురంలో రైల్రోకో చేశారు.
*పరువు హత్య కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ బుధవారం తీర్పు చెప్పారు.
*కుమురం భీం జిల్లా వాంకిడి మండలంలోని గణేష్పూర్ పశుసంతలో బుధవారం మహారాష్ట్ర పోలీసులు వీరంగం సృష్టించారు.
*పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మానసికంగా కుంగిపోయి వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్ఐటీ)లో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* విచారణకు హాజరై తిరిగి వస్తున్న ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈ నెల 3న జరిగినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
*గాజువాకలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. కంపెనీకి చెందిన నగదును బ్యాంకులో జమ చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెంబడించి రూ.20లక్షలు దోచుకెళ్లిన ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది.
*బ్యాంకు మేనేజర్నని నమ్మించి ఓ సైబర్ నేరగాడు ఏకంగా ముఖ్యమంత్రి భార్యనే బురిడీ కొట్టించి దొరికిపోయాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా ఆమె నుంచి రూ.23 లక్షల సైబర్ నేరానికి పాల్పడి చివరికి కటకటాల పాలయ్యాడు.
*చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో మూడో తరగతి బాలుడు ఆదిత్య(8) హత్య కక్ష కారణంగా జరిగినట్లు ఎస్పీ రవీంద్రనాథ్బాబు స్పష్టం చేశారు. చల్లపల్లిలో బుధవారం విలేకరులకు ఆయన సంఘటన వివరాలు వెల్లడించారు. ఘటనకు ఐదు రోజుల క్రితం వసతిగృహంలో బట్టలు ఉతుకుతుండగా పదో తరగతి విద్యార్థి తల్లిని ఆదిత్య దూషించాడు.
*దిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో రైల్వే సిబ్బంది తనను వేధించినట్లు ఓ యువతి ఆరోపించింది. టీటీఈ, ప్యాంట్రీ సిబ్బంది ఒకరు కలిసి ఐస్క్రీంలో మత్తు మందు కలిపి తినేలా బలవంతం చేశారని పేర్కొంది. ఈ విషయాన్ని బాధితురాలి దగ్గరి బంధువైన విద్యార్థిని ట్వీట్ చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు టీటీఈని వెంటనే సస్పెండ్ చేశారు.
*నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వాంకుడోత్ కమిలి(55) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్ప్రతికి తరలించారు.