DailyDose

ఇండియాలో హువావే సరికొత్త ఫోను-వాణిజ్యం-08/08

Huawei Releases New Phone In India-Telugu Business News Today-Aug82019..ఇండియాలో హువావే సరికొత్త ఫోను-వాణిజ్యం-08/08

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు – వాణిజ్య వార్తలు – 08/08
*శాంసంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌లను నిన్న రాత్రి విడుదల చేసింది. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శాంసంగ్ ఈ ఫోన్లను ప్రదర్శించింది. ఈ రెండు వేరియెంట్లతోపాటు నోట్ 10 ప్లస్‌కు గాను 5జీ సపోర్ట్ ఉన్న మరో వేరియెంట్‌ను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. 5జీ వేరియెంట్‌లో నోట్ 10 ప్లస్‌లో ఉన్న ఫీచర్లే ఉంటాయి. కాకపోతే 5జీ ఫీచర్ ఒక్కటే అదనంగా ఉంటుంది.
*బుధవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లపై అధిక సర్‌ఛార్జీ విధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంటుందన్న వార్తలు మార్కెట్లకు మరింత బలాన్ని ఇచ్చాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 637 పాయింట్ల లాభపడి, 37,327వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇంట్రాడే గరిష్ఠం 37,405పాయింట్లను తాకింది. నిఫ్టీ కూడా 177 పాయింట్ల లాభంతో 11వేల పాయింట్ల మార్కును దాటి, 11,032వద్ద ముగిసింది.
*హానర్ బ్యాండ్ 5 పేరిట హువావే ఓ నూతన స్మార్ట్‌ బ్యాండ్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 0.95 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. రన్నింగ్ సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి పలు యాక్టివిటీలను ఈ బ్యాండ్ ట్రాక్ చేస్తుంది. అలాగే స్లీప్ మానిటర్, ఎస్‌పీవో2 సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్‌లను ఈ బ్యాండ్‌లో అందిస్తున్నారు. బ్లూటూత్ 4.2 ద్వారా ఈ బ్యాండ్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాండ్‌లో 100 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉన్నందున ఈ బ్యాండ్ 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. రూ.2599 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది.
*రుణభారంతో ఖాయిలా పడిన మిక్ ఎలక్ట్రానిక్స్ కొత్త యాజమాన్యం సారధ్యంలో మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ కంపెనీ బాధ్యతలను చేపట్టేందుకు కోసిన్ లిమిటెడ్ కన్సార్టియమ్ ముందుకు వచ్చింది.
* ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవనాలను నిర్మించే కటేరా హైదరాబాద్లో అధునాతన తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. బుధవారం దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించనుంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ హైదరాబాద్ సమీపంలోని షాబాద్ దగ్గర 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంటు కోసం కటేరా దాదాపు రూ.700 కోట్లను ఖర్చు చేయనుంది.
* తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నానక్రామ్గూడలో మహతా ఇన్ఫర్మేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 1147.44 కోట్లతో సెజ్ ఏర్పాటు చేయబోతోందని విశాఖ సెజ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ ఎ.ఆర్.ఎం.రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
* స్థిరాస్తి వ్యాపారంలో విక్రయదారులను, కొనుగోలుదారులను ఒక చోటకు చేర్చి, లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కల్పించే నోబ్రోకర్.కామ్ హైదరాబాద్లో తన సేవలను ప్రారంభించింది. మధ్యవర్తిత్వం ద్వారా క్రయవిక్రయాలు, అద్దె లావాదేవీలు పూర్తయ్యేందుకు సహాయపడతామని, అందుకుగాను ఎలాంటి బ్రోకరేజీ ఫీజునూ వసూలు చేయడం లేదని సంస్థ వ్యవస్థాపకులు అఖిల్ గుప్తా, సౌరభ్ గర్గ్ తెలిపారు.
*వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ( ఎం అండ్ ఎం) నిరుత్సాహకరమైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంస్థ రూ.894.11 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రూ.811 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,719 కోట్లతో పోలిస్తే లాభం 53 శాతం క్షీణించింది.
* ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి టాటా స్టీల్ ఏకీకృత ప్రాతిపదికన రూ.701.97 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
* నీటిని వేడి చేయడం, నీటి శుద్ధి పరికరాలను తయారు చేసే చేసే ఏఓ స్మిత్ రెండు కొత్త ఉత్పత్తులను విపణిలోకి విడుదల చేసింది.
*బంగారం ధర బాగా పెరిగి అమ్మకాలపై ఒత్తిడి పడే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 20 శాతం కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నట్లు టైటన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర భట్ పేర్కొన్నారు.