Devotional

బ్యాంకులు చిల్లర తీసుకుంటే….

TTD To Double Deposit If Banks Takes Coins

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండీలో వచ్చే చిల్లర టిటిడికి ఎప్పుడూ పెద్ద సమస్యే .

టన్నుల టన్నుల చిల్లరను స్టోర్ చేయడం టిటిడికి పెద్ద తలనొప్పి.

ఇక ఈ నేపథ్యంలోనే టీటీడీ చిల్లర సమస్యను పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారించింది.

ఇటీవల చిల్లర ను కరిగించి లడ్డూల ట్రేలను తయారు చేసే ఆలోచన చేసిన టీటీడీ దానిపై వ్యతిరేకత వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఒక తెలివైన ప్లాన్ వేసింది.

బ్యాంకులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

పేరుకుపోతున్న చిల్లర కుప్పలతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో పరకామణిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీటీడీ ఇక ఆ సమస్యకు చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది.

గత కొన్నేళ్లుగా టిటిడికి సంబంధించిన ఆదాయాన్ని పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.

అయినప్పటికీ బ్యాంకులు చిల్లర విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి.

చిల్లరని తీసుకోవడానికి చాలా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టిటిడి నిర్ణయం తీసుకుంది.

చిల్లర నాణేలను డిపాజిట్ చేసుకున్న బ్యాంకులకు ఎంత మొత్తం చిల్లర డిపాజిట్ చేసుకుంటారో అంతే మొత్తంలో మళ్లీ నగదును డిపాజిట్ చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు టీటీడీ అధికారులు.