DailyDose

డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ-వాణిజ్య-08/20

Debit Cards To Be Cancled In India-Telugu Business Today-08/20-డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ-వాణిజ్య-08/20

* డెబిట్‌ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్రమంగా ప్లాస్టిక్‌ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్‌ పేమెంట్‌ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్‌ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది.
*కంపెనీల నుంచి డీలర్లు వాహనాలు కొనుగోలు చేసినప్పుడు, బ్యాంకులు రుణాలిస్తుంటాయి. వీటిని 60 రోజుల్లోపు డీలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
*హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) కూడా ఉత్పత్తిలో కోత విధించేందుకు సిద్ధమైంది. వాహన విపణిలో మెరుగైన పరిస్థితులు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
*దివాలా స్మృతి కింద చిన్న రుణగ్రహీతల అప్పులను రద్దు చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.
*దేశంలోని అన్ని అపోలో ఆసుపత్రుల్లో ప్రజా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ రంగ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్) వెల్లడించింది.
*జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద ఉన్న కేసుల పరిష్కారం ద్వారా డిసెంబరులోపు రూ.1500 కోట్లు రికవరీ చేయగలమని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.జి.చైతన్య తెలిపారు.
* హ్యుందాయ్‌ మోటార్స్‌ మార్కెట్లోకి సరికొత్త ఐ10 నియోస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు నిర్ణయించారు. పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.4.99లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.70లక్షలుగా ఉంది. దీనిలో టాప్‌ఎండ్‌ ధర రూ.7.99లక్షలు(దిల్లీ ఎక్స్‌షోరూం). ఈ మోడల్‌ కారును త్వరలోనే యూరప్‌ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను హ్యుందాయ్‌ స్వీకరిస్తోంది. ప్రస్తుత మోడల్‌ గ్రాండ్‌ ఐ10తోపాటు సరికొత్త మోడల్‌ కూడా మార్కెట్లో అందుబాటులోకి ఉంటుంది. భారత్‌ మార్కెట్‌ అవసరాలకు తగినట్లు ఈ కారును డిజైన్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంది. వీటిల్లో ఫీచర్లను బట్టి ఎరా, మాగ్నా, స్పోర్ట్స్‌, ఆస్టా మోడళ్లు ఉన్నాయి.