DailyDose

కోడెల కుమారుడిపై మరో కేసు-నేరవార్తలు–08/23

Another case filed on kodela son-telugu crime news today-08/23

* సత్తెనపల్లి పట్టణంలో NSP గెస్ట్ హౌస్ నుండి కోడెల శివరాం ఆదేశాలమేరకు 2018లో 30 లాప్ టాప్ లు, ఒక ప్రింటర్ కొందరు వ్యక్తులు తీసుకెళ్లారని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి షేక్ బాజీ బాబు ఫిర్యాదు చేశారు.అని సత్తెనపల్లి పట్టణ సి ఐ విజయ చంద్ర తెలిపారు. ఈ పిర్యాదు పై దర్యాప్తు చేయనున్నట్లు..సి.ఐ తెలిపారు..
* ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీం కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఇవాళ(శుక్రవారం) సుప్రీం తీర్పునిచ్చింది. ఆగస్ట్ 26 వరకు అరెస్ట్ చేయకూడదని తన తీర్పులో తెలిపింది.
* హైదరాబాద్ మియాపూర్‌లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. ధర్మపురి క్షేత్రం దగ్గర 24 ఏళ్ల ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌ ను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. తల, మొండెం వేరుచేసి… తలను బొల్లారం చౌరస్తాలో పడేశారు. మొండెం, తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
* తిరుమల…మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం….ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన బస్సు…ఒక్కరి మృతి…మరొక్కరికి తీవ్ర గాయ్యాలు.
* పశ్చిమబెంగాల్‌లో ఆలయం గోడ కూలి నలుగురు దుర్మరణం చెందగా, సుమారు 27మంది గాయపడ్డారు. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని కచ్వాలోని లోక్‌నాథ్‌ బాబా మందిర్‌లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఇంతలో ఆలయం గోడ ఒక్కసారిగా కూలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
* శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోస్ట్ ఆఫీస్ రోడ్ వున్న నాయుడు జ్యూయలరీ షాపులో చోరి పట్టపగలు షాపుకు వచ్చిన నలుగురు మహిళలు, వెండి బంగారం ఆభరణాలు కొనడానికిని చెప్పి, సినీ పక్కీలో చోరీ
* హైదరాబాద్‌ నగరంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మియాపూర్‌ ధర్మపురిక్షేత్రం వద్ద ఈ దారుణ హత్య జరిగింది. ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌(24)ను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు.
* గజపతినగరం మండలం లోని గుడివాడ వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢకొీని దగ్ధమవడంతో కెమికల్‌ లారీలోని డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.
* అనంతపురం జిల్లాచెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో లో ఉరవకొండ డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ (AP 02 z 0341) బస్సు బోల్తా అందులో ఉన్న 35 మంది ప్రయాణికులు సురక్షితం
* కడప నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులునివాస గృహాల్లో దోపిడీలకు పాల్పడుతున్న దుండగులువీరి వద్ద నుండి107 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్న చిన్నచౌక్ పోలీసులు
* గర్భిణీ అయిన దళిత మహిళ సర్పంచ్‌పై దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ గ్రామంలో చోటుచేసుకుంది.
* పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లా కచువాలోని లోక్‌నాథ్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు భక్తులు మరణించారు. మరొక 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
* గుర్రాయి జలపాతంలో గురుకుల కళాశాల విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెలవు దినం కావడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి జి.మాడుగుల గురుకుల కళాశాల విద్యార్థి జలపాతానికి వెళ్లాడు. స్నేహితులను ఫోటో తీయమని గురుకుల విద్యార్థి నీటిలోకి దిగాడు. ఫోటో దిగుతుండగా నీటి ఉధృతికి కొట్టుకుని పోయాడు. మృతుడు పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి వాగులో పడేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపెల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వాగులో లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
* శంషాబాద్ గగన్ పహాడ్ లో రెండేళ్ల వయస్సు ఉన్న బాలిక కిడ్నాప్ కు గురైంది.
*కుటుంబపెద్దను చంపి, ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో కూరిన వారు కేవలం పింఛను డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. *
*భార్యతో గొడవలు ఆ యువకుడికి ఆవేదనను కలిగించాయి. కోడలికి నచ్చజెప్ప లేకపోయామనే బాధ ఆ వృద్ధ దంపతులను నిలువనీయలేదు. ముగ్గురూ కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
*స్నేహితుడితో మాట్లాడేందుకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (20) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది.
*రాష్ట్రంలో పరువు హత్యలపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హైకోర్టుకు నివేదించారు. రెండేళ్లలో 4 పరువు హత్యలే జరిగాయని, అందులో 3 కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేశామని తెలిపారు.
*మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనం చేసిన వ్యక్తి నుంచి సొత్తు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు కొత్త పద్ధతి అవలంబించారు. ఎట్టకేలకు దాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు పలువురు ప్రముఖులకు పార్శిల్లో మురుగునీరు పంపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
*మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు నిరాకరించడంతో మరోదారిలేక వంతెన పై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*తల్లి, సోదరులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఓ బాలుడు(17) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన బాధితురాలి చెల్లెలిని గదిలో బంధించి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో చోటుచేసుకుంది.
*రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నంబర్ 135 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్ మాజ్ అహ్మద్ అనే వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోట సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు.