Fashion

3D షర్టు….భలే సీక్రెట్టు

3D TShirts Fashion - Telugu Fashion News

స్టైల్‌గా సౌకర్యంగా… అందంగా అందరికీ నప్పేలా… ఉండే బట్టలు ఏవీ అంటే టీ షర్టులని ఠక్కున చెప్పేస్తాం. వీటికి సీజన్‌తో కూడా పనిలేదు. ఏ కాలంలో అయినా ఫ్యాషన్‌గానే కనిపిస్తాయి. అందుకే, నాటి టెలీగ్రామ్‌ తరం నుంచీ నేటి వాట్సాప్‌ తరం వరకూ టీ షర్టులు యువతకు ఎప్పుడూ ఫేవరెట్లే. అయితే, షర్టులు పాతవైనా లుక్‌ మాత్రం కొత్తగా ఉండాలన్నది ఈతరం కాన్సెప్ట్‌. కాబట్టే, హీరోలూ నాయకుల ఫొటోలతో వచ్చే షర్టులు ఇపుడు పాత ఫ్యాషన్‌ అయిపోయాయి. రకరకాల కొటేషన్లు ఉన్నవి కూడా రోజువారీకి అన్నట్లు మారిపోయాయి. అసలే ఈరోజుల్లో ఫ్యాషన్‌ అంటే ‘ఇవాళ ఉన్నదీ… రేపు ఉండనిదీ’ అన్నంతగా మారిపోయింది పరిస్థితి. అందుకు తగ్గట్లే మిగిలిన దుస్తుల్లో ఎన్నెన్నో కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. ‘మరి టీ షర్టులు మాత్రం అలాగే ఉండిపోతే ఎలా…’ అని ఆలోచించినట్లున్నారు ఫ్యాషన్‌ గురూలు. అనుకున్నదే తడవుగా ఉన్నది లేనట్లూ లేనిది ఉన్నట్లూ చూపించే త్రీడీ టెక్నాలజీతో టీ షర్టులకూ హైటెక్‌ లుక్‌ని తొడిగేశారు. షర్టుమీద ఊసరవెల్లి పాకుతున్నట్లూ పొట్టను చెక్కలు చేస్తూ గుర్రం బయటికి వస్తున్నట్లూ వీపులోంచి పిల్లి పిల్లా గుండెల్లో నుంచి కుక్కపిల్లా తొంగి చూస్తున్నట్లూ… రకరకాలుగా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఆ త్రీడీ సిత్రాలే. త్రీడీ టెక్నాలజీతో వేసిన ప్రింటింగ్‌ కారణంగా షర్టు మీద వేసిన జంతువుల బొమ్మలు చాలా సహజంగానూ చూపులకు ఉబ్బెత్తుగానూ కనిపించి నిజంగా అక్కడ ఆ జంతువులు ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ తడిమి చూస్తే అవి మామూలు ప్రింట్లలానే చొక్కాని అతుక్కుని ఉంటాయి. ఈ త్రీడీ టీ షర్టుల్ని వేసుకుని కాలేజీకెళ్తే ఎవ్వరైనా ఓ క్షణం కళ్లప్పగించాల్సిందే, మరుక్షణం ‘వారెవ్వా టీ షర్టు అదిరింది బాసూ’ అనాల్సిందే… కాదంటారా..?

Image result for 3d t shirt

Image result for 3d t shirt

Image result for 3d t shirt

Image result for 3d t shirt

Image result for 3d t shirt