Politics

కడప జిల్లాపై భాజపా కన్ను

BJP Aims Kadapa District Capture

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ రాయలసీమ జిల్లాలపై కన్నేసింది.

పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించే దిశగా పావులు కుదుపుతోంది.

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, తటస్థులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాల్లో వేళ్లూనుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు కమలనాథులు.

ఇందులో భాగంగా- కడప జిల్లా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున ప్రాంతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఇటీవలే బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సొంత నియోజకవర్గం కావడం,

ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కాషాయ కండువాను కప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత తొలిసారిగా బీజేపీ నాయకులు రాయలసీమ ప్రాంత విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.