DailyDose

క్షీణిస్తున్న చిత్తూరు మాజీ ఎంపీ ఆరోగ్యం:తాజావార్తలు-09/19

Chittoor Ex MPs Health Deteriorating-Telugu Breaking News-09/19

* చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
* కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కస్టడీని అక్రోబర్ 3వరకు ధిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది
* ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. జిల్లాలో సమస్యల గురించి చేర్చించారు
* మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ను కలిసి జగన్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని , జోక్యం చేసుకోవాలని వినతి పత్రం అందించారు
* రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా విద్యాసాగర్ రెడ్డీని నియమించారు
* కార్పోరేట్ స్కూళ్ళలో ఫీజులను నియంత్రించాలని విజయవాడలో నిర్వహించిన విద్యార్ధి సంఘాల సమేవేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీశారు
* ఇప్పటివరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న మమతా బెనర్జీ, అమిత్ షాలు నేడు ధిల్లీలో భేటీ అయ్యారు
* కేంద్రం ప్రవేశ పెట్టిన భారీ ట్రాఫిక్ పెనాల్టీల నిరసనగా దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మే నిర్వహించారు
* మాద్రాస్ హై కోర్ట్ చీఫ్ జడ్జ్ తహీల్ రమణి బదిలీపై హై కోర్ట్ లో ఓ పిటీషన్ దాఖలైయింది
* పులివెందల, బందరు, మార్కాపురంలో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
* తెలుగు దేశం నేతలపై వైకాపా ప్రభుత్వం పెట్టిన కేసులను పార్టీ పరంగా ఎదుర్కోవాలని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు
* శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోని కుడి గట్టు ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీని కారణంగా కొద్ది గంటల పాటు విద్యత్ ఉత్పత్తి నిలిచిపోయింది
* ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఓ చిత్రంలో రైతు పాత్రలో దర్శనమివ్వనున్నారు
* కనిగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భైరవకొన ఆలయ ఈవో నారాయణ రెడ్డీ మృతి చెందారు
* దేవీపట్నం వద్ద బోటు మునిగిన ప్రదేశంలో ఏర్పడిన సుడిగుండం ప్రపంచంలోనే అతిపెద్దదని ప్రమాద కరమైందని నిపుణులు ఈ రోజు గుర్తించారు