DailyDose

నటి భానుప్రియపై కేసు:నేరవార్తలు-09/21

Case FIled On Actress Bhanupriya-Telugu Crime News Today-09/21

* ఇంటి పనికోసం బాలికను నియమించుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నటి భానుప్రియపై చెన్నైలో కేసు నమోదైంది. చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న భానుప్రియ ఇంటి పనికోసం ఏపీలోని సామర్లకోటకు చెందిన బాలికను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విషయమై సామర్లకోట పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు చెన్నై పోలీసులకు బదిలీ అయింది.
* ఓ కెమికల్ కంపెనీలో కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రిఆక్షన్ అయి మిస్ ఫైర్ అవడం తో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది.జీడిమెట్ల పియస్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కార్తికేయ కెమికల్ పరిశ్రమలో ఉదయం సుమారు 5అం ప్రాంతంలో కంపెనీ సిబ్బంది కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రిఆక్షన్ అయి మిస్ పైర్ కావడంతో రియాక్టర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారి పెద్ద శబ్దం వచ్చి మంటలు రావడంతో సిబ్బంది కంపెనీ బయటకు వచ్చి జీడిమెట్ల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారు 5 ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణ నష్టం జరుగ లేదు. కంపెనీ యాజమాన్యం ఇంతవరకు సంఘటన స్దలానికి రాలేదు. ఇదే కంపెనీ లో అగ్నిప్రమాదం రెండొవసారి సంభవించిందని, కంపెనీ నుండి ప్రమాదకర రసాయనాల వాసన వల్ల తమకు శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, శ్వాసకోశ రోగాల భారిన పడుతున్నామని, ఎన్ని సార్లు కంపెనీ యాజమాన్యం దృష్టికి తెచ్చిన, పెడ చెవిన పెట్టేదని ఇప్పటికైనా అధికారులు మామూళ్ళకు ఆశపడకుండా ఇలాంటి కెమికల్ కంపెనీలను అవుటర్ రింగ్ రోడ్ అవుతలకు తరలించాలని స్దానిక ప్రజలు డిమాండు చేస్తున్నారు.
* కర్ణాటక హైకోర్టును బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు లేఖ పంపించడంతో బెంగళూరులో కలకలంరేగింది. కర్ణాటక హైకోర్టుతో పాటు అనేక ప్రసిద్ది ప్రాంతాలను బాంబులతో పేల్చుతామని, ఉగ్రదాడులే మాలక్షం అని గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాయడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పాక్ మద్దతుదారుల కోసం గాలిస్తున్నారు.
* వత్సవాయి మండలం డ్వృ కెనాల్ సమీపంలో భీమవరం గ్రామానికి చెందిన మెరుగ నాగిరెడ్డి (36). అప్పుల బాధ తట్టుకోలేక తన సొంత పొలంలో ఉదయం ఉరి వేసుకొని మృతి. మృతుడికి ఒక కుమార్తె, కుమారుడు.
* గ్రేస్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ లైంగిక వేధింపులపై స్పందించిన మహిళా కమిషన్. కళాశాలను సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న కమీషన్ చైర్పెర్సన్ పద్మ. విద్యార్థినుల ముఖాముఖికి మీడియాతో సహా ఇతరులెవ్వరినీ అనుమతించని కమీషన్. కేవలం కళాశాలలో చదువుతున్న విద్యార్థినులతోనే సమావేశమై కళాశాల కరస్పాండెంట్ తీరుతెన్నులు తెలుసుకుంటున్న చైర్పర్సన్.
* ఇరాక్ లో బాబు పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడులో 12 మంది మృతిచెందారు. ఇరాక్ దేశంలోని కర్బల నగర ప్రవేశద్వారం వద్ద మినీ బస్సు ప్రవేశిస్తుండగా పేలుడు సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు మినీబస్సులో బాంబు అమర్చారు. బస్సు కర్బల వస్తుండగా పేలడంతో 12 మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ పేలుడులో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరాక్ మిలటరీ అధికారులు రంగంలోకి దిగి ఈ పేలుడుపై దర్యాప్తు చేస్తున్నారు.
* కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మర్లపాలెం రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తులు కారుకి పంక్చర్ వేయిస్తుండుగా ఆదే సమయంలో జాతీయ రహదారి పై పెట్రోలింగ్ వెళ్తున్న ఎస్ ఐ వాసిరెడ్డి శ్రీనివాస్ అనుమానం వచ్చి కారు వద్ద అగారు. దింతో కారు దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. కారుని తనిఖీ చేయగా 25 ప్యాకేట్లు కలిగిన 50 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి. కారుని స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.