Politics

నెల్లూరులో యురేనియం తవ్వకాలు

Uranium Digging Starts In Nellore Amidst Protesting People

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు రంగం సిద్ధమవుతోంది. పడమటికంబంపాడు అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు చేపట్టనున్నారు. దీనికోసం ఆటోమేటిక్‌ ఎనర్జీ సంస్థ నేతృత్వంలో యంత్రాలు తీసుకొచ్చారు. ఈ తవ్వకాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటపొలాలు, తాగునీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.