NRI-NRT

ఈలా గాంధీకి స్వాగతం పలికిన బే-ఏరియా ప్రవాసులు

Bay Area Telugu NRIs Welcome Ela Gandhi To Gandhi-King Conference At Stanford University-ఈలా గాంధీకి స్వాగతం పలికిన బే-ఏరియా ప్రవాసులు

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆది,సోమవారాల్లో జరగనున్న గాంధీ-కింగ్ సమ్మేళనంలో పాల్గొనే నిమిత్తం కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న గాంధీజి మనవరాలు ఈలా గాంధీకి కోమటి జయరాం ఆధ్వర్యంలో బే-ఏరియా ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత శాంతియుత మార్గంలో పయనించేందుకు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఈ సమ్మేళనం ఉపయోగపడాలని జయరాం ఆకాంక్షించారు. స్వాగతం పలికిన వారిలో డా.సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.