Politics

వంశీది….TDP DNA

Vallabhaneni Vamsi Has TDP DNA. We Wont Let Him Go Says MP Nani.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ది తెదేపా డీఎన్‌ఏ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. వంశీని వదులుకొనేందుకు తెదేపా సిద్ధంగాలేదని చెప్పారు. వంశీ మోహన్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదన్నారు. వంశీ తరఫున పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదని నాని సూచించారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వంశీ మోహన్‌ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖరాసిన విషయం తెలిసిందే. స్థానిక వైకాపా నేతలు,కొందరు ప్రభుత్వాధికారుల వల్ల తన అనుచరులు, మద్దతుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి ఇబ్బందుల్ని తొలగించడానికే తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని లేఖలో తెలిపారు. మరోవైపు, వంశీ రాసిన లేఖపై చంద్రబాబుకు కూడా స్పందించారు. వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగానూ వంశీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.