DailyDose

జగన్ ప్రతి వారం కోర్టుకు రావల్సిందే-కోర్టు:నేరవార్తలు-11/01

Jagan Must Attend In Court-CBI Court Delivers Judgement-Telugu Crime News-11/01

* అక్రమ ఆస్తుల వ్యవహారంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వర్తిస్తున్నందున కోర్టుకు హాజరు కాలేనంటూ జగన్‌ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అక్టోబర్‌ 18న సీబీఐ కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగియగా.. తాజాగా తీర్పు వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ తీర్పుతో ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరు కావల్సి ఉంది.
* అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు బాధితుల ఇంటికి వెళ్లి పరిహారం చెక్కు అందించాలని సూచించారు.
* జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు వాహనాలకు ఉగ్రవాదులు నిప్పు పెట్టారు.
* తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం కరప గ్రామానికి చెందిన గుత్తుల సత్యనారాయణ సామర్లకోట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పచ్చకామెర్ల వ్యాధికి గురి అయి కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
* ఓ గిరిజన బాలిక ఆత్మహత్య చేసున్న విషయం ఆలస్యంగా తెలిసింది. మండలంలో లువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామానికి చెందిన మసాడ విలియంకుమార్‌(27)కు ఓ యువతితో కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. విలియం కుమార్‌ అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక కొండపల్లి లక్ష్మి(15)తో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఈ విషయంలో విలియంకుమార్, అతని భార్యకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
* ఘట్‌కేసర్‌ – బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
*సూర్యాపేట జిల్లా కోదాడలో పెళ్లి బరాత్ విషయంలో ఘర్షణ చెలరేగింది. కోడాడ మండలంలోనే తోగరాయ గ్రామంలో పెళ్లైన తర్వాత ఊరేగింపుకు సిద్ధమయ్యారు. డీజేతో బరాత్ నిర్వహించాలని అబ్బాయి తరఫు బంధువులు అనుకోగా.. అమ్మాయి తరఫు బంధువులు మాత్రం బరాత్‌కు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి దాడి చేసుకునేవరకు వెళ్లింది.అమ్మాయిది ప్రకాశం జిల్లా కావడంతో ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. డీజే వద్దంటూ అమ్మాయిని, అబ్బాయిని తీసుకువెళుతుండగా.. అబ్బాయి తరఫు బంధువులు అడ్డుకున్నారు. వారిపై దాడికి దిగారు. దీంతో రెండు కుటుంబాల తరఫువారు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన యువకులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పెళ్లి ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*గుంటూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
*మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
*విశాఖ జిల్లాలోని కసింకోట మండలం, తాళ్లపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్.. నడిచి వెళ్తున్న దంపతులను ఢీ కొట్టింది. భార్య, భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున వారు పొలం పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
* రోడ్డు దాటుతున్న బైక్ను బస్సు ఢీ కొట్టిన ఘటనలో భార్య, భర్త మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
*జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ కేసు విచారణ చేపట్టిన సీబీఐ అప్పట్లో పలువురు అధికారులపై అభియోగాలు మోపింది
*ఇసుక కొరతతో ఉపాధి పనుల్లేక విషం తాగిన భవన నిర్మాణ కార్మికుడు కన్నుమూశారు. వారం కిందట ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
*జన్యులోపాల కారణంగా ఆడ, మగ లింగభేదం చెప్పలేని విధంగా జన్మించిన ఓ శిశువును బతికుండగానే కుటుంబీకులు ఖననం చేసేందుకు ప్రయత్నించిన వైనమిది. సకాలంలో పోలీసులు వారిని అడ్డుకుని, శిశువును ఆసుపత్రిలో చేర్పించారు.
*తమిళనాడులోని 6 చోట్ల ఎన్ఐఏ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. శ్రీలంకలో ఈస్టర్ రోజు వరుస బాంబు పేలుళ్లతో విధ్వంసం సృష్టించిన ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న రాష్ట్రంలోని కొందరిని ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది. విచారణలో వెలుగుచూస్తున్న వివరాల మేరకు మరికొందరి నివాసాల్లో తనిఖీ నిర్వహిస్తోంది.
*గ్యాంగ్స్టర్ నయీం భార్య హసీనాబేగం, అనుచరులు పాశం శ్రీను, నాసర్లపై పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సంబంధిత ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
*మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన నాయిని అశోక్, స్వప్న దంపతుల కుమార్తె కావ్య.. స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మూడురోజుల క్రితం అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది.
*పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెందిన ఇద్దరు అన్నదాతలు గురువారం బలవన్మరణాలకు పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపేటకు చెందిన ముచ్చర్ల మల్లేశం నాలుగేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.
*ఈనెల 10న గుంటూరులో జరిగిన వృద్ధురాలి మృతి కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఆస్తి కోసం కుమార్తే కన్నతల్లిని చంపినట్లు స్థానిక సీఐ వెంకటరెడ్డి చెప్పారు.
*ఓ ప్రయాణికులు ప్రాణాలకు తెగించి విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది.
*మంగళగిరి మండలం పెదవడ్లపూడి వద్ద గురువారం అర్ధరాత్రి లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి
*కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద జాతీయ రహదారిపై లారీని జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* కేరళ రాష్ట్రంలో గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒకరు మరణించగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. కేరళ రాష్ట్రంలో గత నెల 21 నుంచి భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి
*షాపులను లక్ష్యంగా చేసుకొని రాత్రిపూట షటర్స్ తాళాలు పగలగొట్టి చొరీలు చేసే అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి, రూ.2 లక్షల 70 వేల నగదు, 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ.రవీందర్ తెలిపారు.
*కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని పోదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
*వరంగల్ అర్బన్ జిల్లా:- లారీ, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి, వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడిని వరంగల్ మండలం, దూపకుంట గ్రామానికి చెందిన కండిక బాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*ఖమ్మం జిల్లా బొగ్గు టిప్పర్ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి వై జంక్షన్ వద్ద జరిగింది. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లి గ్రామానికి చెందిన బడే బాబా(55)గా గుర్తించారు.