Editorials

ఏ ప్రభుత్వం ఉన్నా నిజాయతీ IASలకు ఆదరణ కరువు

The Pathetic Condition Of IAS Officers In Andhra-ఏ ప్రభుత్వం  ఉన్నా నిజాయతీ IASలకు ఆదరణ కరువు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. మరోపక్క జగన్ ప్రభుత్వం ఈ విషయంలో అపనింద మోయాల్సిన వస్తోంది. అవినీతి మచ్చలేని అధికారిగా సుబ్రమన్యానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అందువల్లనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయన పనికి మాలిన పోస్టుల్లోనే పని చేయాల్సి వచ్చింది. తెదేపా ప్రభుత్వంలో ఒక కార్యకర్తలా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ ఇప్పటి వైకాపా ప్రభుత్వానికి ముఖ్యులైపోయారు. డిల్లీలో తెదేపా ప్రభుత్వం నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రవీణ్ ప్రకాష్ ముందు నడిచారు. ఎవరు అధికారంలో ఉంటె వారి వెంటే అన్న పద్దతిలో వ్యవహరించే ప్రవీణ్ ప్రకాష్ మాటలు జగన్ ప్రభుత్వానికి రుచికరంగా వినిపించవచ్చు. కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వల్ల ఐఏఎస్ అధికారులు మానసికంగా స్తయిర్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏమైనా తప్పులు చేసి ఉంటె ముఖ్యమంత్రి జగన్ పిలిచి మాట్లాడవచ్చు. వివరణ కోరవచ్చు. హుందాగానే విషయాన్నీ పరిష్కరించవచ్చు. కానీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ మాత్రం ప్రభుత్వం పై తప్పుడు సంకేతాలు అందిస్తోంది. ప్రభుత్వం వైకాపాది అయినప్పటికీ ఐఏఎస్ ద్వారా తెదేపా పార్టీయే పాలన సాగిస్తున్నట్టు కనిపిస్తోంది. గత తెదేపా ప్రభుత్వంలో హవా నడిపిన ఐ పీ ఎస్ లే వైకాపా ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగ్ లు కొట్టేశారు. మంచి మంచి హోదాల్లో కనిపిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం మారాలని అవినీతిని నియంత్రించాలని కోరుకున్న అధికారుల పరిస్థితి ఇప్పటికి అయోమయంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ భవన్ రెసిడెంట్ అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను తీసుకురావడమే పెద్ద తప్పుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆయన గతంలో పనిచేసిన సమయంలో ఎమ్మెల్యేలకు అప్పనంగా భూములు కట్టబెట్టారనే విమర్శలెదుర్కొన్నారు. ఈ క్రమంలో గత తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబు మనిషిగా ఆయన ప్రముఖ పాత్ర పోషించిన విషయాన్ని జనం మర్చిపోలేకపోతున్నారు. అంతే కాకుండా ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న వరుస సంఘటనలు కూడా ప్రవీణ్ ను జగన్ పభుత్వం జీఏడీ రాజకీయ కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించడం పైనా ఆక్షేపణలోస్తున్నాయి. ఆయన తన అధికారాలను మించి పని చేస్తున్నారని సీనియర్లకు చెందాల్సిన ప్రభుత్వ అధికారాలను ఆయనకే కట్టబెట్టుకుంటూ ప్రత్యెక జీవో విడుదల చేయించడం పైనా విమర్శలోచ్చాయి. బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తన పై అధికారులతో పాటు తన సహచరులు, తన కిందిస్థాయి సిబ్బందికి సైతం హుకుం జరీ చేస్తుండడాన్ని సీనియర్ ఐఎఎస్ లు జీర్ణించుకోలేకపోతున్నారు. నిబంధనలు కలరాసినందుకు షోకాజ్ పంపించిన ఎల్వీని బదిలీ వేటు వేసిన ప్రవీణ్ పై విమర్శల వాన కురుస్తోంది.

*** ఇదిగో చూడండి
*గత ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ కార్యదర్శిగా పని చేసిన సతీష్ చంద్రకు జగన్ సర్కార్ ఉన్నత విద్య కార్యదర్శిగా స్కిల్ డెవలప్ మెంట్ గా నియమించింది. ఆయన గత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించారు. గత మే 24న సతీష్ కు బదిలీ అయినా నవంబర్ ఒకటి వరకు పోస్టింగు ఇవ్వలేదు ఈ విషయాన్ని సిఎస్ ఎల్వీ ఎన్నోమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ముఖ్యమంత్రి జగన్ వద్దన్నారంటూ సమాధానం వచ్చేది. అయితే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ బాద్యతలు స్వీకరించాకే బదిలీల ప్రక్రీయ ఊపందుకుంది.
*గతంలో ముఖ్యమంత్రి బాబుకు బాగా కావాల్సిన వ్యక్తిగా వ్యవహరించిన పూనం మాలకొండయ్యను కూడా తిరిగి ఆమె కోరుకున్న చోటుకే తీసుకువచ్చారు.
*గతంలో మున్సిపల్ డైరెక్టరుగా వ్యవహరించిన కన్నబాబును గ్రామ సచివాలయ ఉద్యోగ శిక్షణ అమలు అధికారిగా పోస్టింగ్ ఇప్పించడంలో ప్రవీణ్ దే పైచేయి అయిందంతున్నారు.
*గతంలో మున్సిపల్ శాఖ అనుబంధ విభాగమైన మెప్మా డైరెక్టర్ గా వ్యవహరించిన చినతాతయ్యను ప్రస్తుతం అదే శాఖలో కొనసాగేలా చేశారు. కన్నబాబు చినతాతయ్య కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అప్పటి మున్సిపల్ మంత్రి నారయణకు కూడా సన్నిహితులేనని చెబుతున్నారు.
*గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలు నిర్వహించిన సాయిప్రసాద్ మినహా మిగతా ఐ ఏ ఎస్ లందరికి మంచి పోస్టింగు లే దక్కాయని చెబుతున్నారు.
* సిఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్య.. బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ పంపించారు. అంతలోనే సిఎల్ ఎల్వీ పై వేటు పడింది. అయితే నిబంధనల ప్రకారం షోకాజ్ కు వరం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. కానీ షోకాజ్ పంపిన సిఎస్ నే ప్రవీణ్ తనకున్న విశిష్ట అధికారాలతో బదిలీ చేయడంతో అప్పుడా వివరణ సంగతేంటని అంతా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సిఎస్ ఎల్వీ ఆకస్మిక బదిలీపై ఐఎఎస్ ఉద్యోగుల సంఘం నోరు మెదకపోవడం పైనా విమర్శలోస్తున్నాయి. ఎల్వీకి అని వర్గాల నుంచీ మద్దతు లభిస్తున్నా తాజా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందంటున్నారు. ఎవరు నోరు మెదిపితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వారిలో నెలకొందన్నారు. మొతానికి ఐఏఎస లలో ప్రభుయ్త్వ ద్వంద్వ విధానం కారణంగా ప్రతిస్తంబన నెలకొందని సిఎస్ అంతటి వారికే అలా జరిగితే మిగతా అధికారుల పరిస్థితి ఏం కావాలంటున్నారు. ఇంకోవైపు ప్రవీణ్ ప్రకాష్ మొదలుకుని సతీష్ చంద్ర తదితరులు ఉత్తరాది నుంచి వచ్చినవారే మళ్ళీ సిఎస్ గా పోస్టింగు తెచ్చుకునేందుకు సిద్దంగా ఉన్న నీలం కూడా ఉత్తరాదివారే. సంజయ్ శర్మ, కూడా ఆ ప్రాంత వారేనని ఇదంతా చూస్తుంటే వైకాపా ప్రభుత్వం ఉత్తరాది ఐఏఎస్ లేక్ ప్రాధాన్యం ఇస్తుందనే వార్తలొస్తున్నాయి.