Business

భారతీయులకు వాట్సాప్ అంటేనే మొహం మొత్తింది

WhatsApp Users Reduced By 80Percent In India

భారత్ లో వాట్స్ అప్ కు తగ్గుతున్న ఆదరణ
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్‌ను ఉపయోగించేందుకు భారతీయులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది.
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 మధ్యకాలంలో భారతదేశంలో వాట్సప్ డౌన్‌లోడ్స్ 80 శాతం తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత్‌లోని ప్రముఖుల వాట్సప్‌లను హ్యాక్ చేసినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాట్సప్‌‌ను ఉపయోగించడానికి భారతీయులు విముఖత వ్యక్తం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో ఇతర మెసేంజర్ యాప్‌లను వినియోగించేందుకు భారతీయులు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. అక్టోబర్ 26-నవంబర్ 3 మధ్య వాట్సప్ డౌన్‌లోడ్స్‌ తగ్గగా టెలిగ్రామ్‌కు ఆదరణ పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.