Politics

మాగంటి బాబు జంప్ కొడతారా?

What happened to Maganti Babu?

మాజీ ఎంపీ మాగంటి బాబు కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. వ్యక్తిగత పర్యటనలు లేవు. సమావేశాలకు రావడం లేదు? అసలు రాజకీయంగా యాక్టివ్ గా లేరు. మాగంటి బాబుకు ఏమైంది? ఇది పశ్చిమగోదావరి జిల్లా తెదేపా నేతల ప్రశ్న 2019 ఎన్నికల్లో మాగంటి గెలుస్తారని అందరూ అనుకున్నారు. ఆయన సెగ్మెంట్ లో విసృతంగా ప్రచారం చేహరు. కానీ ఓడిపోయారు. ఎన్నికల్లో పార్టీ అన్ని రకాలుగా తనకు సాయం చేయలేదని అనుచరుల దగ్గర వాపోయారట. చింతలపూడి మార్కెట్ యార్డు చైర్మన్ పదవీ తన అనుచరుడికి ఇవ్వకపోవడం తనకు తీవ్రంగా కలిసివేసిందని అప్పట్లో అనేవారట. అయితే ఎన్నికలు రావడంతో మరోసారి మాగంటి బాబు ఎంపీగా పోటీ చేశారు. అయితే ప్రస్తుటం మాగంటి బాబు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఆయన యాక్టివ్ గా ఉండడం లేదు. రాజకీయ వారసుడిగా జిల్లా తెలుగు యువత అద్యక్షుడు మాగంటి రాంజి తెరపైకి వచ్చారు. ఈయన పై మాగంటి ప్యామిలీ ఆశలు పెట్టుకుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన ఈయన కూడా సైలెంట్ అయ్యారు. దీంతో మాగంటి ప్యామిలీ అడుగులు ఎటువైపు అనే చర్చ మొదలైంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు జీవితం గడుపుతున్నాడు. తన సామాజికవర్గానికి చెందిన ఆయన్ని కూడా పరామర్సించేందుకు మాగంటి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు ఈమధ్య లోకేష్ వచ్చారు. పార్టీ విశ్రుత సమావేశాలు జరిగాయి. కానీ వ్యక్తిగత పర్యటనల తరువాత ఆయన పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. డిల్లీలో ఆయనకు ఉన్న పరిచయాల నేపధ్యంలో మాగంటి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. ఒకరిద్దరు అంటున్నారు. మరి ఏలూరు రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి.