Movies

అమ్మ.అరవిందస్వామి.

Aravaindaswamy In Kangana Ranaut's Thalaivi Biopic Of Jayalalita

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ‘తలైవి’ పేరుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆదివారం నుండి చెన్నైలో ప్రారంభమైంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎంజిఆర్ లేకుండా జయలలిత బయోపిక్‌ను ఊహించలేం. ఈ చిత్రంలో ఎంజిఆర్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద్‌స్వామి నటిస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కాలిన్స్… కంగనారనౌత్‌ను జయలలితగా చూపిస్తున్నారు.పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఆమెకు తైమూర్ అలీఖాన్ పటౌడి అనే బాబు పుట్టాడు. అనంతరం మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. యంగ్ హీరోయిన్లకు ధీటుగా తిరిగి ఫిట్‌నెస్ సంపాదించి సినిమాలు చేస్తోంది. రెఫ్యూజీ సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే తన గ్లామర్ సీక్రెట్ చెప్పింది బెబో. నిత్యం సూర్య నమస్కారాలు చేయడం ఆ రహస్యమని పేర్కొంది. 50 సూర్య నమస్కారాలు ఏకధాటిగా చేసేస్తుందట ఈ భామ. దీంతో పాటు డైటింగ్ కూడా చేస్తూ మెరుపుతీగలా మారింది కరీనాకపూర్.