Food

ఈ ఆహారం క్యాన్సర్ కలిగిస్తుంది

Here is a huge list of cancer causing foods that you eat daily-telugu food and diet news

ఆహారం విషయంలో చాలామందికి కనీస అవగాహన ఉండదు. ఏవి పడితే అవి తినేస్తుంటారు. అయితే కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌ వస్తుంది. ఆ కారకాలేంటంటే..క్యాన్సర్‌ కారక ఆహారాల్లో రిఫైన్డ్‌ ఫుడ్‌ ప్రధానమైంది. రిఫైన్డ్‌ షుగర్‌ శరీరంలోని ఇన్సులిన్‌ లెవెల్స్‌ను పెంచుతుంది. క్యాన్సర్‌ సెల్స్‌ పెరగడానికి దోహదపడుతుంది. ట్యూమర్లు, క్యాన్సర్‌ రిఫైన్డ్‌ షుగర్‌ తినడం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చక్కెర ఎక్కువగా వాడే బదులు బెల్లం, తేనె వాడడం మంచిది.ంక్‌ఫుడ్‌ను ఇష్టపడే వారు ఎక్కువమందే ఉంటారు. అయితే ఇందులో కొన్ని రకాల రసాయనాల్ని వాడుతుంటారు. అందుకని వీటిని క్యాన్సర్‌ కారకాలుగా చెప్పుకోవచ్చు. మాంసం పాడవకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలు వాటికి పూస్తుంటారు. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతుంటారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి వాడే ప్రిజర్వేటివ్స్‌ అన్నీ క్యాన్సర్‌ కారకాలే అని గుర్తించాలి.ప్రస్తుతం చేపల్ని చెరువుల్లో, సముద్రంలో పెంచడం లేదు. చాలావరకు ఫలసాయం ద్వారా పెంచుతున్నారు. ఇవి పెరగడానికి హానికర మందులు వాడుతున్నారు. వీటికి రోగాలు రాకుండా పెస్టిసైడ్స్‌, బ్యాక్టీరియా వంటివి వాడుతున్నారు. ఈ చేపల ఆహార పదార్థాలూ క్యాన్సర్‌ కారకాలే.ాలావరకు బేకరి, ఫాస్ట్‌ఫుడ్స్‌లో వాడే పిండి రిఫైన్డ్‌ పిండే. పిండిని రిఫైన్డ్‌ చేయడం ద్వారా దాంటోని న్యూట్రిషన్‌ తీసేయడం జరుగుతుంది. ఇలా చేయడానికి క్లోరిన్‌ గ్యాస్‌, ఇతర కెమికల్స్‌ వాడుతుంటారు. బ్లీచింగ్‌ ప్రాసెస్‌లో కూడా ఎన్నో రకాల కెమికల్స్‌ వాడుతారు. ఇవన్నీ క్యాన్సర్‌ కారకాలే.ల్కహాల్‌ అధికంగా తీసుకునే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. నోరు, అన్నవాహిక, పేగు, కాలేయం, రొమ్ముక్యాన్సర్‌లను కలిగించే ప్రమాదం ఎక్కువ ఉంది. ఎక్కువగా చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ తినే వారికి కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.