Politics

ఓటు నమోదుకు మరో అవకాశం వచ్చింది

Indian Govt Lets You To Register For Vote Now-Nov 2019

తాజాగా ఓటు నమోదుకు మరోమారు అవకాశం ఎన్నికల కమీషన్‌ కల్పించింది. మరో మూడు నెలల్లో ఏపీలో స్ధానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం యువతీ, యువకుల్లో ఉత్సాహం నింపుతుంది. 2020 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వజ్రాయుధం లాంటి ఓటుహక్కును సొంతం చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులతో పాటు నూతన ఓటు నమోదుకు అవకాశం కల్పించడం జరిగింది. అధికారులు సైతం ఆ కోణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల వారీగా బీఎల్వోల వద్ద నూతన ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాక మీసేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశం ఉంది.