ScienceAndTech

నోకియా-ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ వచ్చేసింది

Nokia Releases 55Inch UHD Smart TV Based On Android

మొబైల్‌ తయారీ కంపెనీ నోకియానుంచి తొలి స్మార్ట్‌టీవీ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ దీన్ని రూపొందించింది. 55 అంగుళాల 4కే యూహెచ్‌డీ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌టీవీలో జేబీఎల్‌ ఆడియో టెక్నాలజీ వినియోగించడం ప్రధాన ఆకర్షణ. దీని ధరను రూ.41,999గా ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. డిసెంబర్‌ 10 నుంచి దీని అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. టీవీతో పాటు స్టాండ్‌, వాల్‌మౌంట్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో కూడిన బ్లూటూత్‌ రిమోట్‌ను అందిస్తున్నారు. ప్రారంభ ఆఫర్‌ కింద ప్రీపెయిడ్‌ లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. రూ.999కే మూడేళ్ల టీవీ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ను అందిస్తున్నారు. స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇందులో 55 అంగుళాల 4కే యూహెచ్‌డీ స్క్రీన్‌ ఉంది. క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, డాల్బీ విజన్‌ సపోర్ట్‌, ఇంటిలిజెంట్‌ డిమ్మింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 9 ఓఎస్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌టీవీ గూగుల్‌ ప్లే స్టోర్‌ కూడా ఉంటుంది. 2.25 జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజీ ఉంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు (2.0, 3.0) ఉన్నాయి. వైఫై, బ్లూటూత్‌ 5.0 కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. 24 వాట్‌ జేబీఎల్‌ స్పీకర్‌ కలిగిన ఈ స్మార్ట్‌టీవీ డీటీఎస్‌ ట్రూసరౌండ్‌, డాల్బీ ఆడియో ఫీచర్లు ఇంట్లో కొత్త అనుభూతిని అందిస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్‌లో నోకియా బ్రాండ్‌పై మరిన్ని స్మార్ట్‌టీవీలను తీసుకొస్తామని తెలిపింది. విక్రయానంతర సేవలు.. రిపేర్‌, మెయింటెన్స్‌ సేవలు అందించే జీవ్స్‌ ద్వారా లభిస్తాయని పేర్కొంది. ఫర్నీచర్‌ ఇన్‌స్టాలేషన్‌, ఇతర సేవల కోసం ‘జీవ్స్‌’ సేవలను ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే వినియోగిస్తోంది.