Editorials

పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి?

Explain citizenship ammendment bill by India

పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి అనేది మనంకూడ తెలుసుకుందాం
దేశభద్రత అంశాన్ని ఇలా వాడుకుంటున్న పార్టీలకు ప్రజలు బుద్దిచెబుతారు

విదేశీ రోహింగ్యాలకు భారత దేశ పౌరసత్వం ఇచ్చి దేశంలో ఉంచుకోవాలా ?

1947 లో భారతదేశం రెండుగా విడిపోయింది. అదికూడా మతం పేరుపైన. ఆ సమయంలో భారత్ నుండి పాకిస్థాన్ వెళ్ళిన వారు, అటునుండి భారత్ వచ్చినవారు ఉన్నారు. కొన్ని లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.1950 ఏప్రెల్ 8 పాకిస్థాన్ తరుపున లియాఖత్ అలీ ఖాన్, భారత్ తరపున నెహ్రూల మద్య ఒక ఒప్పందం జరిగింది. పాకిస్థాన్, హిందుస్థాన్ అనేవి మత ప్రాతిపధికన విడిపోయాయి కాబట్టి,పాకిస్థాన్ లో హిందువులు వివక్షతకు గురి అయినా, దాడులకు గురి అయినా వారు భారత్ కు రావాలనుకుంటే వారికి భారత్ ఆశ్రయ మియ్యాలి. అలాగే భారత్ లో ముస్లీములు వివక్షకు గురి అయినా, దాడులకు గురి అయినా ముస్లీములు భద్రతకోసం పాకిస్థాన్ కు వెళ్ళదలుచు కుంటే పాకిస్తాన్ వారికి ఆశ్రయ మియ్యాలి. ఇది సంక్షిప్తంగా ఆ ఒప్పంద సారాంశం.

ఆ తరువాత పాకిస్థాన్ రెండుగా విడిపోయి బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు గా రూపుదిద్దుకున్నాయి.1947 విభజన నాటికి పాకిస్థాన్ లో 25 శాతం హిందువులు మిగిలారు.వారు వేటికి పడిన,పడుతున్న ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. వారి ధన మాన ప్రాణాలు దోచుకున్నారు. నేటికి దోచుకోబడుతున్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో బలవంతంగా మతం హింస బారిన పడ్డారు. ఎంతో మంది పాకిస్థాన్ లో ఇతర మతాలకు చెందిన స్త్రీలు గ్యాంగ్ రేప్ కు గురి అయ్యారు. ఎంతో మంది ఆచూకీ లేకుండా పోయారు. ప్రస్తుతం పాకిస్థాన్ బంగ్లదేశ్ లలో 1.5శాతం మంది మాత్రమే ముస్లీమేతర మతస్తులు మిగిలిఉన్నారు.ఆఫ్గనిస్తాన్ కూడా ఇందుకు ఏమీ తీసిపోలేదు.

బంగ్లేదేశ్ నుండి పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చిన హిందువులకు నేటికి 70 సంవత్సరాలైన చాలామందికి పౌరసత్వం లభించలేదు .
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ మొదలైన దేశాలనుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు మొదలైన అల్పసంఖ్యాకుల భద్రత కోసం చాలా సంవత్సరాలుగా ఈ బిల్లు కోసం ఎదురుచూపుతో బతుకుతున్నారు.ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఈ బిల్లు తీసుకు వచ్చింది. దీనిని పౌరసత్వ సవరణ బిల్లు అంటారు. కోంతమంది విదేశీ ముస్లీములకు ఎందుకు ఈ భద్రత, సదుపాయాలు ఇవ్వలేదు అనే ప్రశ్నను కోందరు నేతలు అడుగుతున్నారు. వాస్తవానికి ముస్లీం దేశం కావాలని మత ప్రాతిపథికన దేశాన్ని చీల్చుకుని వారు వెళ్ళారు.కాబట్టి అయాదేశాలకు చెందినవారికి ఈ భద్రత కల్పించ బడదు అని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.ఈ బిల్లు ఈ దేశంలో నివసించే మన సోదర ముస్లిం ప్రజలకు కాని పౌరులకు కాని ఏమాత్రం నష్ట కలగదు.అక్రమంగా ఈదేశంలోకి వచ్చి దేశభద్రతకు ప్రమాదంగా ఉన్న కోంతమందికి మాత్రం వారిని గుర్తించి వారిదేశానికి తిరిగి పంపుతారు.
ఇది సంక్షిప్తంగా ఈ బిల్లు కథ.

కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణం ఈ బిల్లు ద్వారా ముస్లీం సోదరి సోదరుల ఓటు బ్యాంకు రాజకీయలు మరియు మతంపేరుతో సంతుష్టీకరణ రాజకీయం కోసం మాత్రమే.

దేశ వ్యాప్తం గా పౌరసత్వ
బిల్లు ప్రవేశ పెట్టడం వల్ల
మైనారిటీ లో అభద్రత
భావం తో వున్నారని రాజకీయలబ్దికోసం తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ ,కమ్యనిస్టులు ప్రారభించారు.
అన్నదమ్ముల వలే ఉన్న
హిందు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఇన్నాళ్ళు మైనాటిల ఓట్లు దండుకోన్నారు. వీరి మతరాజకీయాలు
చాలా దారుణం,దేశసమగ్రతకు ఇది ప్రమూదం.దేశంగురిఆలోచిండం మానేసి నేడు కోన్నిపార్టీలు మతాల
మధ్య చిచ్చు పెట్టి దేశభద్రత అంశాన్ని ఇలా వాడుకుంటున్నారు.దేశంలో యువత వీటిని
వ్యతి రేకించాలి.ఇలాదేశసమగ్రతకోసం పార్లమెంట్ తెచ్చేమంచిచట్టాలకు మద్దతుఇవ్వాల్సనఅవసరం మనమీదఉంది .

ఈదేశంలో పుట్టిన ప్రతి ముస్లిం సోదర,సేదరీమణి ఈదేశస్తులే భారతమాత ముద్ధుబిడ్డలే.