DailyDose

గుంటూరులో అయిదేళ్ల బాలికపై అత్యాచారం-నేరవార్తలు-12/13

5 Year Old Raped In Guntur-Telugu Crime News Roundup-12/13

* గుంటూరులో 5 సంవత్సరాల బాలికపై అత్యాచారం. నగరంలో రామిరెడ్డి నగర్ కి చెందిన 5 ఏళ్ల బాలిక పై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.

* తిరుమల మాడ వీధిలో వ్యక్తి ఆత్మహత్య టీటీడీ పాల లారీ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని మాడ వీధిలో పాలు దించిన పాల మిత్ర లారీ ముందుకు కదులుతుండగా పక్కనే ఉన్న వ్యక్తి వెనుక చక్రాల కింద కు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అతడు అక్కడికక్కడే మరణించాడు..మొదట దీన్ని ప్రమాదంగా భావించారు. అయితే సీసీ ఫుటేజ్ చూశాక ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరణించిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు.. తిరుమల మాడవీధిలో ఈ ఆత్మహత్య జరగడంతో వెంటనే ఆలయంలో శ్రీవారి దర్శనాలు నిలిపి వేశారు. మాడ వీధులలో మృతి చెందడంతో ఆలయ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు సూచనతో ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీవారి దర్శనాన్ని పునఃప్రారంభించారు..

* దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయేషామీరా హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయేషా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం తెనాలి చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహిస్తారు. కేసును సీబీఐకి అప్పగించినందున ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు. 2007 డిసెంబరు 27న విజయవాడ ఇబ్రహీపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఎన్నో మలుపులు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మొదటి నుంచి పలు మలుపులు తీసుకుంది. నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు విద్యార్థి, సామాజిక సంఘాలు ఆందోళనలు, మరోవైపు రాజకీయ ఒత్తిడిల మధ్య పోలీసులు శాస్త్రీయ పరిశోధన విస్మరించారనే అపవాదు ఉంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షంషాద్‌బేగం, ఇక్భాల్‌భాషాలకు  ఆయేషా మొదటి సంతానం. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిమ్రా కళాశాలలో బిఫార్మసీ చదువుతూ స్థానికంగా ఉన్న ప్రైవేటు వసతి గృహంలో ఉండేది. 2007డిసెంబరు 27 ఉదయం ఆమె రక్తపు మడుగులో మరణించి ఉండటాన్ని గుర్తించారు. డిసెంబరు 26 రాత్రి ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్థరించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు ఆందోళనలు చేశాయి. సంఘటన జరిగిన తర్వాత అకస్మాత్తుగా సత్యంబాబు తెరమీదకు వచ్చారు. సరిగ్గా 2008 ఆగస్టు 17న సత్యంబాబును ఒక కేసులో అరెస్టు చేశారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబు గతంలో అదేతరహా నేరాలు చేశారని ఆయేషా హత్య తానే చేశానని అంగీకరించారని అరెస్టు చేశారు. పోలీసులే సత్యంబాబుతో నేరం అంగీకరింపజేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సత్యంబాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ 2010 సెప్టెంబరులో తీర్పు చెప్పింది. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కేసు మళ్లీ మొదటికి రావడంతో ఆయేషా హత్యకేసును సీబీఐకి అప్పగించారు. ఇప్పటికైనా ఆయేషా హత్యకేసులో అసలు దోషులను సీబీఐ గుర్తిస్తుందని  బాధితురాలి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు

* అందమైన కట్టడాలతో పింక్​ సిటీగా పెరుగాంచిన రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో ఓ చిరుత హల్​చల్​ సృష్టిస్తోంది. అడవి నుంచి తప్పిపోయి నివాస ప్రాంతంలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సుమారు 24 గంటలకుపైగా అటు ప్రజలకు, ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దానిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోనే రాజస్థాన్​ హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఎట్టకేలకు చిరుతను బంధించారు.

* గురజాల మండల శివారు గ్రామం అంబాపురం కోల్డ్ స్టోరేజ్ వద్ద బైకను ఢీ కొన్న ఆర్టీసి బస్సు, ఇద్దరి పరిస్థితి విషమం ఒకరికి గాయాలు, ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* రాష్ట్రంలోని విల్లుపురం సమీపంలోని సలామత్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల స్వర్ణకార కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ లాటరీకి ఈ కుటుంబం బలైపోయినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్ష అమలులో ఆలస్యంపై పిటిషన్‌ వేస్తామని నిర్భయ తల్లి తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసేందుకు సీజేఐ ఎస్‌ఏ బొబ్డే అనుమతించారు. ఈ నెల 17న సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించనుంది. నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను ఈ నెల 18కి కోర్టు వాయిదా వేసింది. నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది కోర్టు.

* శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలంటూ ఇద్దరు మహిళా సామాజిక కార్యకర్తలు రెహనా ఫాతిమా, బిందు అమ్మిని దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు భద్రత కల్పించేలా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వలేదని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. అలా అని శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలని కేరళ సర్కారును ఆదేశించబోమని స్పష్టం చేసింది. శబరిమల అంశం భావావేశాలతో కూడుకున్నదని, దాన్ని విస్ఫోటకంలా మార్చదల్చుకోలేదని పేర్కొంది న్యాయస్థానం. రివ్యూ పిటిషన్లపై విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినందున ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

* టీటీడీ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు మీడియా సమావేశం. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పాల వ్యాన్ క్రింద పడి చనిపోవడం దారుణం. మాఢ వీదులలో మరణం జరగడంతో ఆలయంలో శుద్ది కార్యక్రమం చెసి తరువాత యధావిధిగా కార్యక్రమాలు నిర్వహించాం. తిరుమల లో దేహ త్యాగం చెస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మూడనమ్మకంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు… తిరుమల లో ప్రమాదవశాత్తు ఎదైనా మరణం సంభవిస్తే అలాంటి వారు మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది… బలవంత మరణం చాలా దారుణం… ఇలాంటి చర్యలకు భక్తులు ఎవరు పాల్పడవద్దు…ఇది మంచి పద్ధతి కాదు….ఇది చాలా పాపం. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేవిదంగా ఉన్న చర్యలు ఎవరూ చేయకూడదు…టీటీడీ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు

* హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూజిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

* గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు తప్పిన భారీ పెనుప్రమాదం కారులో ఇరుక్కున్న భార్య భర్తలు అమరావతిలో పెళ్లికి హాజరై విజయవాడ వస్తుండగా ఉండవల్లి మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగి పడి షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో వెంటనే స్పందించి విద్యుత్ నిలిపివేశారు దీనితో మరో భారీ ప్రమాదం తప్పింది గ్రామస్థులు కారులో ఉన్న భార్య భర్తలను బయటకి తీయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు తొలగించి కేసు నమోదు చేశారు.