WorldWonders

వయాగ్రా కలిపిన నీరు తాగిన గొఱ్ఱెలు

Ireland Shepherds Blame Pfizer For Releasing Viagra Into Sheep's Drinking Water

ఐర్లాండ్‌లోని రింగస్కిడ్డీలో ఓ వింత ఘటన జరిగింది. ఇక్కడి ఓ నౌకాశ్రయం సమీపంలో నీరుతాగిన వందలాది గొర్రెలు వారం రోజుల పాటు విపరీతంగా శృంగారంలో పాల్గొన్నాయి. వాటి ప్రవర్తన చూసిన గొర్రెల కాపరులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని బయటపెట్టిన ఓ పత్రిక.. ఊరికి సమీపంలోని ఫైజర్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించింది.
ఈ కంపెనీలో తయారుచేసిన వయాగ్రా మందు పొరబాటున హార్బర్‌లోని నీళ్లలో కలిసిందని, వాటిని తాగడం వల్లే గొర్రెలు ఇలా ప్రవర్తించాయని పేర్కొంది. అయితే ఈ వార్తలను ఫైజర్ ప్రతినిధులు ఖండించారు. తాము పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించే ఉత్పత్తులనూ తయారుచేయడం లేదని వారు స్పష్టం చేశారు. ఈ గొర్రెల ఘటనకు, తమ కంపెనీకి అస్సలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరిగిందో కూడా తమకు తెలియదని అధికారులు చెప్పారు.