Movies

వేధింపులను వదిలేయకండి

Sunny Leone Speaks On Work Place Sexual Abuse

వేధింపులను సహించకండి అని అంటున్నారు బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ. తన స్టైల్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సన్నీ ఇన్‌స్టా వేదికగా తరచూ ఎన్నో విశేషాలను షేర్‌ చేస్తుంటారు. తాజాగా సన్నీ లియోనీ పనిప్రదేశాల్లో వేధింపులను సహించకండి అని చెబుతూ ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఉన్న ఈ వీడియో సన్నీలియోనీ ఓ సంస్థలో పనిచేసే అధికారిలా కనిపించారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘పని చేసేచోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి.’ అని సన్నీ లియోనీ పేర్కొన్నారు. సన్నీలియోనీ ప్రస్తుతం ‘కోకో కోలా’ సినిమాలో నటిస్తున్నారు. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దీనితోపాటు ఆమె దక్షిణాదిలో తెరకెక్కనున్న ‘రంగీలా’, ‘వీరమదేవి’ చిత్రాల్లో నటించనున్నారు. మరోవైపు పలు బుల్లితెర రియాల్టీ షోలలో కూడా సన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.