Business

అప్పుల ఊబిలో హైదరాబాదీ యువత

Hyderabadi Youth Has Highest Amounts Of Debt

రుణాలు అధికంగా ఎవరు తీసుకుంటారు? అనడిగితే.. ‘అత్యవసరంగా ఎవరికి డబ్బులు అవసరముంటే వాళ్లు’ అని సమాధానం చెబుతారు. కానీ హైదరాబాద్‌ యువకులు ఎడాపెడా రుణాలు తీసుకుంటున్నారట! ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది.ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చే సంస్థ ‘క్యాష్‌ ఈ’. ఇటీవల ఈ సంస్థ పలు నగరాల్లోని యువతపై ఓ సర్వే జరిపింది. వైద్య ఖర్చులు, ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోళ్లకు యువత ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మొత్తం రుణాలు తీసుకుంటున్న వారిలో 31 నుంచి 38 ఏండ్ల మధ్య ఉన్న యువత 52 శాతం మంది. అధిక రుణాలు తీసుకుంటున్న వారిలో బెంగళూరుకు చెందిన యువత మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో హైదరాబాద్‌కు చెందిన యువత ఉంది. హైదరాబాద్‌లోని రూ.25 వేల నుంచి రూ.50 వేలు మధ్య సంపాదించేవారు ఈ లోన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో వెల్లడించింది.