Movies

వరుడి కోసం విరహం

Adah Sharma And Wedding-Telugu Movie News

‘‘నాకు వరుడు కావాలి. కాకపోతే కొన్ని షరతులు వర్తిస్తాయి’’ అని అంటున్నారు అదా శర్మ. ఇటీవల ‘కల్కి’లో రాజశేఖర్‌ ప్రేయసిగా నటించారు అదా శర్మ. ట్విట్టర్‌ వేదికగా వరుడు కావాలని ప్రకటించారు. ‘‘ఉల్లిపాయలు తినకూడదు. కులం, రంగు, మతం, షూ సైజ్‌, వీసా, ఈతలో నైపుణ్యం, కండరాల పుష్టి, ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్ల సంఖ్య, జాతకాలతో పనిలేదు. కాకపోతే రోజుకు మూడు పూటలు చిరునవ్వుతో వంట చేయాలి. ప్రతిరోజూ శుభ్రంగా గడ్డం చేసుకోవాలి. భారతీయ సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. ప్రతిరోజూ తాగడానికి 5 లీటర్ల నీళ్లు ఇస్తాను. కానీ ఇంటా, బయటా మద్యం తాగడానికి అనుమతించను. ఇంకో ముఖ్యమైన విషయం… భారతీయ భాషల్లోని అన్ని చిత్రాలనూ చూడాలి. ఆస్వాదించగలగాలి’’ అని అదా ట్వీట్‌ చేశారు. ఆమె ప్రస్తుతం ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’, ‘మ్యాన్‌ టు మ్యాన్‌’లో నటిస్తున్నారు.