DailyDose

ఉరిశిక్ష మళ్ళీ వాయిదా-తాజావార్తలు

Nirbhaya Hanging PostPoned Again-Telugu Breaking News

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు పటియలా హౌస్‌ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాల ఇచ్చే వరకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని ఆదేశించింది.
* సంక్షేమ పథకాల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘జగనన్న చేదోడు’ పేరుతో రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. త్వరలోనే జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. ఐదేళ్లపాటు ఏటా రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
* నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత క్షణక్షణం ఉత్కంఠగా మారుతోంది. శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు వేసిన పిటిషన్‌పై దిల్లీ కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇదిలా ఉండగా.. తాను మైనర్‌ అంటూ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
* టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి సేవకుడాదళారినాఅని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య ప్రశ్నించారు. అమరావతిని విచ్ఛినం చేసి పబ్బం గడుపుకోవాలని సీఎం జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి శాసనమండలి గ్యాలరీలో ఏం పని అని ఆయన నిలదీశారు. విశాఖ శారదా పీఠంలో కూర్చుని సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దళారితనం చేయాలనుకుంటే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆనంద్ సూర్య చెప్పారు.
*ఓవైపు జనవరి 31న ఆవెంటనే ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆతరువాత ఆదివారం ఇలా మూడు రోజులు బ్యాంకులు మూతపడటంతో వెతనజీవులు సోమవరం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబందించి ఇండియన్ బాంక్స్ అసోసియేషన్తో జరిపిన చర్చల విఫలం కావడంతో ఈ సమ్మె చేయనున్నారు.
*ప్రపంచ వ్యాప్తంగా రానున్న ఐదేళ్ళ పాటు సూర్యుడు సెగలు పుట్టిన్చానున్నాడు. 2020 వరకు 2024మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు ఓఅక డిగ్రీ సేల్సీయాస్ నుంచి 1.60 డిగ్రీల వరకు పెరుగుతుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
*కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి, యునాని ఔషధాలు సమర్ధంగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ బుధవారం సూచించింది. కరోనా వైరస్ రాకుండా నివారించేందుకు మూడు రోజుల పాటు పరగడుపున హోమియో మందు ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదే డోసేజీని నెల రోజుల తర్వాత మరోసారి వేసుకోవాలని తెలిపింది.
* ప్రాణాం తక కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రా లు పఠించాలని చైనాలోని తన అనుచరులకు టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వల్ల ఆ దేశంలో ఇప్పటివరకూ 106 మంది చనిపోగా వేల మంది దాని బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు భక్తులు.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్‌బుక్‌ వేదికగా దలైలామాను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘తారా మంత్రం’ పఠించాలని సూచించారు. ‘వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ మంత్రం సాయపడుతుంది’ అని చెప్పారు. ‘ఓం తారే తుత్తారే తురే సోహా’
అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్టుకు దలైలామా జతచేశారు.
*అక్రమాస్తుల కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలని ఈ నెల 24న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరవుతారా లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా పడింది. ఈ రోజు విచారణకైనా మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. తమ వద్ద పిటిషన్ పెండింగులో ఉందని.. సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చని హైకోర్టు జగన్ తరఫు న్యాయవాదులకు ఇటీవల సూచించింది.
*నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు… రోజుకో మలుపు తిరుగుతోంది. దోషుల న్యాయపరమైన అవకాశాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో శిక్ష అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నలుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్పై దిల్లీ కోర్టుకు నేడు తిహార్ జైలు అధికారులు ఇవ్వనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
*దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దోషులను ఉరితీసే తలారి పవన్ జల్లాద్ మీరట్ నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరుకున్నారు. పవన్ జల్లాద్ రేపు ఉరితాడు, ఉరికంబం సామర్థ్యాలను పరీక్షించనున్నారు. జైలు అధికారుల సమక్షంలో డమ్మీ ఉరి నిర్వహించనున్నారు. నిర్భయ కేసులో నలుగురు దోషులను ఏకకాలంలో ఉరి తీయనున్నారు. కాగా, తలారి పవన్ జల్లాద్ కు తీహార్ జైలు ప్రాంగణంలోనే ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు. మరోవైపు, నిర్భయ దోషి వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఉరి ఫిబ్రవరి 1న ఉరి అమలుపై సందిగ్ధత నెలకొంది.
*ఈరోజు నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు. నో సీఏఏ, నో ఎన్‌పీఆర్‌, నో ఎన్‌ఆర్‌సీ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు
*పౌర సరఫరాల శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పౌరసరఫరాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
*అక్రమాస్తుల కేసులో విచారణను ఫిబ్రవరి 7 కు వాయిదాసీబీఐ కోర్టు కు హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్ హైకోర్టు లో పెండింగ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆబ్సెంట్ పిటిషన్ ను సేకరించిన సీబీఐ కోర్టు
*ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పై తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులతో, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ జిసి కిషోర్‌ కుమార్‌ లు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సమీక్ష కొనసాగుతోంది
*సత్వర న్యాయం నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై ప్రమాణ పత్రం దాఖలు చేయని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
*సింగరేణిని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్కు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. థాయ్లాండ్ కేంద్రంగా నడుస్తున్న ఏషియా వన్ పత్రిక, యూఆర్ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూపు 2019-20 సంవత్సరానికిగానూ వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే ‘భారతీయ మహంతం వికాస్ పురస్కార్’కు ఆయన్ను ఎంపికచేసింది.
*సింగరేణిని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్కు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. థాయ్లాండ్ కేంద్రంగా నడుస్తున్న ఏషియా వన్ పత్రిక, యూఆర్ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూపు 2019-20 సంవత్సరానికిగానూ వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే ‘భారతీయ మహంతం వికాస్ పురస్కార్’కు ఆయన్ను ఎంపికచేసింది.
*కరోనా వైరస్ కేసులతో వణికిపోతున్న చైనాలోని వుహాన్ నగరంలో మన దేశానికి చెందిన 58 మంది యువ ఇంజినీర్లు చిక్కుకున్నారు. వారిలో తెలుగువారే ఎక్కువ మంది ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడి అధికారులు వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ నగరంలో ఈ నెల 23 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
*వైద్య పరికరాలను రోగులకు అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చే విషయంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిణామాలపై ఐఐటీ హైదరాబాద్ దృష్టిసారించింది. దీనిలోభాగంగా ‘సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంటర్ప్రెన్యూర్షిఫ్(సీఎఫ్హెచ్ఈ)’ ఆధ్వర్యంలో ‘మెడ్టెక్ (మెడికల్ టెక్నాలజీ)’ సదస్సును బుధవారమిక్కడ నిర్వహించింది. దీనిద్వారా వైద్య, సాంకేతిక రంగాల్లోని నిపుణులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చామని ఐఐటీహెచ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
*బాలలను తన్నుతూ, వ్యాన్లో ఎక్కించిన ఘటనపై బాలల హక్కుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం నిర్వహించిన ధర్నా సందర్భంగా చిన్నారుల పట్ల సీఐ రాజు, సిబ్బంది దురుసుగా వ్యవహరించారని పేర్కొంది.
*రాజధాని అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ఫీజు నిమిత్తం రూ.5 కోట్లు కేటాయిస్తూ జారీచేసిన జీవోను సవాలుచేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్బాబు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో రుసుము చెల్లించేందుకు న్యాయవాదుల చట్టం అనుమతిస్తుందో.. లేదో పరిశీలించాలని, ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని జీవోను రద్దుచేయాలని కోరారు.
*నీతి ఆయోగ్ గత ఏడాది డిసెంబరు నెలకు సంబంధించి వెల్లడించిన ఆకాంక్ష జిల్లాల ర్యాంకింగ్లలో ఉత్తర్ప్రదేశ్లోని చందౌలీ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఒడిశాలోని బొలంగీర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, జల వనరులు, నైపుణ్యాభివృద్ధి తదితర అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ప్రతినెలా ఆకాంక్ష జిల్లాల జాబితాను రూపొందిస్తుంది.
*అమ్మఒడి పథకం రూ.15వేల నుంచి పారిశుద్ధ్య నిర్వహణకు రూ.వెయ్యి వసూలు చేయడం ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా మారిందని ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, హృదయరాజు వెల్లడించారు. రూ.వెయ్యి వసూళ్లను తాము చేయలేమని, తల్లిదండ్రుల కమిటీలకే అప్పగించాలని పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రుల విషయంలో ఏ పాఠశాలకు సహాయం అందించాలనే అంశంపై తగాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
*అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) పట్టణ ప్రజలు వినియోగించుకునేలా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రజల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, రుసుం వసూళ్లకు వీలుగా పట్టణ ప్రణాళిక విభాగ వెబ్సైట్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది. మరోసారి ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చే అవకాశం లేదని, ఇదే చివరిదని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు రావొచ్చని అంచనా. వీటిపై రుసుం కింద పట్టణ స్థానిక సంస్థలకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
*గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ను ఎప్పుడు జారీచేసే అవకాశముందో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై ఈనెల 24న జారీ చేసిన తుది గెజిట్ నోటిఫికేషన్ను సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేసేలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) కాసా జగన్మోహన్రెడ్డి బదులిస్తూ.. నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేసే విషయం తనకు తెలియదని, వివరాలు కనుక్కొని కోర్టు ముందు ఉంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు.
* టాస్ బారత్ ఓడిన భారత్ .. పలు మార్పులతో బరిలోకి కోహ్లీసేనవెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టీ 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. భుజం గాయం కార‌ణంగా విలియ‌మ్సన్ విశ్రాంతి తీసుకోవ‌డంతో కెప్టెన్ బాధ్య‌త‌లు సౌథీకి ద‌క్కాయి.