DailyDose

విజయమ్మ షర్మిలకు కోర్టు సమన్లు-నేరవార్తలు

Court Summons YS Vijayamma And Sharmila-Telugu Crime News

* ఏపీ సీఎం వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎలక్షన్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పరకాలలో జరిగిన ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో వైఎస్ విజయమ్మతో పాటుగా షర్మిల పైనా కేసులు నమోదయ్యాయి. కొండా మురళీతోపాటు కొండా సురేఖపైనా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జనవరి 10న వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే సమన్లు అందకపోవడంతో వారు కోర్టు ముందు హాజరు కాలేదు. దీంతో మరొకసారి సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నాంపల్లి కోర్టు వై.ఎస్. విజయమ్మ షర్మిలకు సమన్లు జారీ చేసింది. విజయవాడలో ఉన్న వైఎస్ విజయమ్మ, షర్మిలకు నాంపల్లి కోర్టు అధికారులు స్వయంగా సమన్లు అందజేయనున్నారు. ఫిబ్రవరి 14న వీరిద్దరూ తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
* కూతురు బర్త్‌డేకు పిలిచి పిల్లలను ఇంట్లో బంధించిన నేరస్తుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఫరూకాబాద్‌ జిల్లా కఠారియా గ్రామానికి చెందిన సుభాష్ బాథమ్‌ మర్డర్ కేసులో బెయిలుపై విడుదలయ్యాడు
*pజర్మనీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహన్ రెడ్డి(23).. ఉన్నత చదువుల నిమిత్తం 2017లో జర్మనీ వెళ్లాడు. అక్కడి డస్‌బర్గ్-ఈస్సెన్ వర్సిటీలో చేరాడు. ఈ ఏడాదితో కోర్సు కూడా ముగిసిపోనుంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన తండ్రికి ఫోన్ చేసి బాధపడ్డాడు. తీవ్ర ఒత్తిడికి గురైన మొహన్ రెడ్డి.. బుధవారం తాను నివసిస్తున్న భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
*చికెన్ మాంసంలో కాకి మాంసం కలిపి విక్రయిస్తున్నా ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటుచేసుకుంది.
* విద్యార్థులు, కూలీలకు గంజాయిని విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల నేపధ్యంలో… అరెస్ట్ చేసి వారి నుంచి 13 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పల్సర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
* మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మహిళ కానిస్టేబుళ్లపై అడవి పందులు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురు ట్రైనీ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మరికొందరి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
* గ్స్ స్మగ్లింగ్ కోసం కొందరు కేటుగాళ్లు ఏకంగా ఓ భారీ సొరంగాన్నే తవ్విన వైనమిది. కేవలం ఒక మనిషి పట్టేలా రెండు అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల ఎత్తులో అత్యంత నేర్పుగా దీన్ని తవ్వారు. మెక్సికో సరిహద్దు వద్ద తాము ఈ సొరంగాన్ని కనిపెట్టినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. 4,309 అడుగుల పొడవున్న ఈ రహస్య మార్గంలో ఓ లిఫ్ట్, రైల్వే ట్రాక్, డ్రైనేజీ, ఎయిర్ వెంటిలేటర్లు, హై ఓల్టేజ్ విద్యుత్ కేబుళ్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి మెక్సికోలోని టిజువానా పారిశ్రామిక ప్రాంతాన్ని కలుపుతూ ఈ సొరంగాన్ని నిర్మించారు.
*ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదంఆగివున్న ట్రైన్ వెనుక బోగీలో నుండి ఎగిసిపడిన మంటలుమంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
*కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ప్రేమ విఫలమైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను మనసుపడిన సహచర విద్యార్థి ఒకరు మరో యువతితో ప్రేమలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని తట్టుకోలేక పోయింది. దీంతో ఆమె సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది.
*కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్.11 దుప్పి కొమ్ములు, మూడు ఎర్రచందనం దుంగలు, 5 కత్తులు, రెండు గోడ్డలతో పాటు పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
*తూ. గో.జిల్లా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో 10 పైగా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
*శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం,, కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా,,మాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు,,
*పుదుచ్చేరిలో బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. పుదుచ్చేరిలోని కిరుమాంపాకం గ్రామంలో ఈరోజు బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
*కృష్ణా జిల్లామైలవరం లో గంజాయి పట్టివేతమైలవరం లో ఓ విద్యార్థి వద్ద గంజాయి ఉందన్న సమాచారం తో ఆ విద్యార్థి నీ అదుపులోకి తీసుకున్న సి ఐ.పి.శ్రీను, ఎస్ఐ.కే.ఈశ్వరరావు.అతని వద్ద మూడు కిలోల గంజాయి స్వాధీనం.మైలవరం లో కొంత కాలంగా గంజాయి నీ విద్యార్థులు,రోజువారీ కూలి లకు విక్రయిస్తున్న ట్లు సమాచారం.విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు.
*జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి.
*జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి.
*జనగామలోని ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.
*కొత్తగూడెం లో కట్టెతల తేజ అనే విద్యార్థి మృతి..స్కూల్ లో మృతి చెందగా విద్యార్థులతో విద్యార్థి మృతదేహాన్ని ఇంటికి పంపిన యాజమాన్యంస్కూల్ దగ్గర విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేస్తున్న విద్యార్థి బంధువులు
మృతికి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*అమరావతి తరలిపోతుందనే మనో వేదనతో గుండె పోటుకి గురైన మరో రైతు
*జనగామ జిల్లా రఘనాదపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో ని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫాక్టరీ లో ప్రమాదం రియాక్టర్లు చార్జీగ్ పెడుతుంటగా ప్రమాదం భారీగా ఎగిసిపడుతున్న మంటలు..
*అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులే మద్యం దుకాణాలపై దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకొని పంచాయతీ కార్యాలయంలో ఉంచిన వైనం శుక్రవారం విజయనగరం జిల్లా గుర్ల మండలం గరికివలస గ్రామంలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గుర్ల మండలం గరికివలస గ్రామంలోని 200 నాటుసారా ప్యాకెట్లను, 100 మద్యం సీసాలను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. గత వారం రోజుల నుంచి తమ గ్రామంలో ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తాము చెబుతున్నప్పటికీ ఎక్సైజ్‌ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
*పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెం.248 వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువెళుతున్న కారు అదుపతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. కారును క్రేన్‌ సాయంతో తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశారు.
*18 ఏళ్ల యువతికి పెళ్లి చేసేందుకు తేదీ ఖరారు అయిందని, ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో జరిగింది.
*భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండలం సారపాక ఎంఎస్‌ఆర్ పబ్లిక్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాలలోనే ఊరి వేసుకోని మృతి చెందాడు. మృతదేహాన్ని ఇతర విద్యార్థులతో పాఠశాల సిబ్బంది ఇంటికి పంపించారు. కాగా… విద్యార్థి మృతదేహంతో పాఠశాల ముందు రాస్తారోకో చసేందుకు బంధువులు సిద్ధమయ్యారు.
*వసంతపంచమి వేళ మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గురువారం పాఠశాలకు సెలవు ప్రకటించడంతో సరదాగాఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు ముగ్గురు చెరువులో పడి దుర్మరణం చెందారు.వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
*యువతిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో గుంటూరు అరండల్పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ రామును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతోపాటు, తన తల్లిపై అనుచితంగా ప్రవర్తించారంటూ యువతి ఆరోపించింది.
*బిస్కెట్ల ఆశ చూపి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయనగరం పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో బుధవారం రాత్రి వివాహ వేడుక జరుగుతోంది. పిల్లలంతా నృత్యాలు చేస్తూ సందడిలో మునిగిపోయారు. పక్కనే నివాసం ఉంటున్న అప్పారావు అనే 56 ఏళ్ల వ్యక్తి బిస్కెట్లు ఇస్తానంటూ ఓ బాలికను పిలిచాడు. తెలిసిన వ్యక్తే కావడంతో అతని దగ్గరికి వెళ్లడంతో ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు.
*ముగ్గురు చిన్నారులను బలిగొన్న చెరువుముగ్గురు చిన్నారులను బలిగొన్న చెరువు
వసంతపంచమి వేళ మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గురువారం పాఠశాలకు సెలవు ప్రకటించడంతో సరదాగాఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు ముగ్గురు చెరువులో పడి దుర్మరణం చెందారు.వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*ఉన్నత విద్యను అభ్యసించేందుకు జర్మనీ వెళ్లారు ఆ విద్యార్థి… కానీ అక్కడ చదువుల సాగరంలో ఈదలేక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహనరెడ్డిది(23) రైతు కుటుంబం. ఆయన 2017లో ఎంఎస్ చదివేందుకు జర్మనీలోని డస్బర్గ్-ఈస్సెన్ వర్సిటీలో చేరారు. కోర్సు పూర్తవబోతున్న తరుణంలో కొన్ని పరీక్షల్లో అనుత్తీర్ణుడవటం అతడిలో ఆందోళన రేపింది. నాలుగు రోజుల కిందట తండ్రి గోవిందరెడ్డికి ఫోన్చేసి… నాన్నా.. సరిగా చదవలేకపోతున్నా అని వాపోయారు. బుధవారం తాను నివసిస్తున్న భవనంపై నుంచి దూకి మోహనరెడ్డి చనిపోయారు.
*ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషులుగా తేలిన ఇద్దరికి దిల్లీ న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఏప్రిల్ 15, 2013న మనోజ్ షా (30), ప్రదీప్ కుమార్(25)లు ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ప్రైవేట్ అవయవాల్లోకి వస్తువులు చొప్పించారు.
*కలకాలం కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య అనుమానం పెనుభూతమైంది. చివరికి వారి ప్రాణాలు బలితీసుకుంది. క్షణికావేశంలో తండ్రి చేసిన దాడిలో గాయపడిన ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో బుధవారం ఈ విషాదం జరిగింది.
(*అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు, అశ్లీల వీడియోలతో నన్ను చిత్రహింసలు పెడుతున్నారు.. ఉదయాన్నే ఫోన్ చూడాలంటేనే భయం వేస్తోంద’ని సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్ చేసినా వేరే ఫోన్నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించింది.
*అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి తరఫు వారు ఆ విషయంపైనా చర్చించారు. యువకుడు అందుకూ అంగీకరించడంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా రేపు పెళ్లనగా, ఒకరోజు ముందు అతను అదృశ్యం కావడంతో అందరూ అవాక్కయ్యారు. నిర్మల్ జిల్లా ముథోల్లో బుధవారం జరిగిన ఉదంతమిది.
*కలకాలం కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య అనుమానం పెనుభూతమైంది. చివరికి వారి ప్రాణాలు బలితీసుకుంది. క్షణికావేశంలో తండ్రి చేసిన దాడిలో గాయపడిన ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది
*ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సంఘటన స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
*పౌరసత్వ వ్యతిరేక చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి.
*ఒడిశాలోని గంజాం జిల్లా తప్తపాణి ఘాట్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 40 మందికి గాయాలయ్యాయి. రాయగడ జిల్లా టికిరి నుంచి సుమారు 48 మంది ప్రయాణికులతో బ్రహ్మపుర వస్తున్న ఓ ప్రైవేటు స్లీపర్ బస్సు ఘాట్పై పాళుఖొళ సమీపాన మలుపువద్ద అదుపుతప్పి వంతెన కింద సుమారు 14 అడుగుల సెలయేటిలోకి దూసుకుపోయి బోల్తాపడింది. చనిపోయిన 8 మందిలో ఆరుగురు మహిళలున్నారు
*కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్స్టేషన్లోని బ్యారక్లో హెడ్కానిస్టేబుల్ పంతం లచ్చయ్య(58) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి ఠాణాలో లచ్చయ్య మూడేళ్లుగా పని చేస్తున్నారు.
*దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ, సిగరెట్లను అధికారులు బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు రూ.16.50లక్షల విలువైన బహ్రెయిన్, కువైట్ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. సమాచారం అందుకున్న భద్రతాధికారులు తనిఖీ చేయడంతో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గుట్టురట్టయింది. మరో ఘటనలో దుబాయ్, మలేసియా, కాంబోడియా నుంచి వచ్చిన ఆరు మంది ప్రయాణికులు రూ.50లక్షల విలువైన విదేశీ సిగరెట్లను తరలిస్తూ పట్టుబడ్డారు.
*పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి, నేరుగా స్టేషన్కే వెళ్లి లొంగిపోయిన ఉదంతమిది. పశ్చిమ మండల అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్దిఖీ బుధవారం వివరాలు వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎంఎస్ మక్తాలో నివాసం ఉండే షేక్ జహంగీర్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సమీపంలోనే నివాసముండే వ్యక్తి కుమార్తె(13)పై కన్నేశాడు.
*న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన తల్లి, కుమార్తెల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. అరండల్‌పేట ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడంతోపాటు డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేస్తూ గురువారం ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌, అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.
* సొంత తల్లిదండ్రుల్ని, తమ్మున్ని ఓ మైనర్ బాలుడు చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బాలుడు చిన్నతనంలోనే మద్యానికి బానిస కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.