Movies

96 నుండి తగ్గి…

Sara AliKhan On Her Thoughts-Telugu Movie News Today

సారా అలీఖాన్‌ కథానాయికగా చేసింది రెండు చిత్రాలే. కానీ తన నటన, అందంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆమె సౌందర్యం వెనుక కఠోరమైన శ్రమ దాగుంది. సినిమాల్లోకి రాకముందు సుమారు 96 కిలోల బరువున్న సారా, ఏడాదిన్నర పాటు జిమ్‌లో చెమటోడ్చి తన శరీరాన్ని నాజూగ్గా తీర్చిదిద్దుకుంది. ఇప్పటికీ క్రమం తప్పకుండా కసరత్తులను కొనసాగిస్తూనే ఉంది. దానికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ స్ఫూర్తి నింపుతుంటుంది సారా. ఈ ప్రేమికుల రోజున ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ చిత్రంతో అలరించడానికి వస్తోంది. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌ సరసన నటించిందామె. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ‘‘నాకు బాగా గుర్తు. నేను లావుగా ఉన్న సమయంలో ఓ రోజు జిమ్‌లో వెయిట్‌ బాల్‌ పట్టుకుని క్రంచెస్‌ (వెల్లకిలా పడుకుని శరీరాన్ని నడుము వరకు పైకి లేపడం) చేయడం మొదలుపెట్టాను. అయితే నా బరువు వల్ల మూడు క్రంచెస్‌కి మించి చేయలేకపోయాను. అంతకు మించి చేయగలనా అనుకున్నాను. అయితే మరుసటి రోజు పట్టుదలతో ప్రయత్నించి నాలుగు క్రంచెస్‌ చేశాను. ఆ తర్వాత ఐదు.. ఆరు.. ఇలా పెంచుకుంటూ పోయాను. ఇప్పుడు నేను క్రంచ్‌ ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నాన’’ని చెప్పింది సారా.