Movies

అఘోరాగా నందమూరి అందగాడు

Nandamuri Balakrishna As Aghora In His Next Movie

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విజయవంతమైన ఈ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. బాలకృష్ణ రెండు కోణాలతో కూడిన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆయన సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడబోతున్నారు. ఇదివరకే ఈ సినిమా ప్రారంభమైంది. చిత్రీకరణ ఈ నెల 26న వారణాసిలో మొదలు కాబోతోంది. కథ వారణాసి నేపథ్యంలోనే సాగుతుందని సమాచారం. బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా కనిపిస్తారట. అందుకు సంబంధించిన లుక్‌పై కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.