Videos

“సామజవరగమన” పూర్తి వీడియో పాట విడుదల

Samajavaragamana Full Video Song-Ala Vaikuntapuramlo Telugu Song

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సామజవరగమన’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ‘సామజవరగమన’ పాట మాత్రం విడుదల చేసిన నాటి నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘సామజవరగమన’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లో మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల్లో లైకులతో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకువెళ్లింది. ‘సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా పేరుపొందిన ఈ పాటకు ఎన్నో పేరడిలు కూడా వచ్చాయి. ‘సామజవరగమన’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోన్న నేపథ్యంలో తాజాగా ఆ పాటకు సంబంధించిన సాంగ్‌ ఫుల్‌ వీడియోను ఆదివారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. పారిస్‌లో చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్‌లో బన్నీ స్టైల్‌.. పూజా హెగ్డే అందం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ పాటలో పూజాహెగ్డే అందం ముందు పారిస్‌ అందాలు చిన్నబోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.!!