Movies

రికార్డుల రారాణి విజయనిర్మల

Remembering The Lady Of Records Vijaya Nirmala

విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 – జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు విజయ నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.1946 ఫిబ్రవరి 20 న తమిళనాడులో విజయ నిర్మల జన్మించారు.విజయ నిర్మల తండ్రిది చెన్నై.తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట.కేవలం ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం “మత్స్యరేఖతో” సినీరంగ అరంగేట్రం చేశారు.11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యారు.తెలుగులో “రంగులరాట్నం” చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు.నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు.విజయ నిర్మల బాలనటిగా కెరీర్ ప్రారంభించి,సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా,దర్శకురాలిగా,మరియు నిర్మాతగా తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ.1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు.44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. మీనా,కవిత,దేవదాసు,దేవుడు గెలిచాడు,రౌడీ రంగమ్మ,మూడు పువ్వులు ఆరు కాయలు,కిలాడీ కృష్ణుడు,బోగిమంటలు, పుట్టింటి గౌరవం,నేరము శిక్ష, మొగుడు పెళ్లాల దొంగాట,హేమా హేమీలు,రామ్‌ రాబర్ట్‌ రహీం,సిరిమల్లె నవ్వింది,భోగి మంటలు,బెజవాడ బెబ్బులి,ముఖ్యమంత్రి,దేవదాసు,దేవుడే గెలిచాడు,లంకె బిందెలు,కలెక్టర్‌ విజయ,ప్రజల మనిషి తదితర చిత్రాలకు విజయ నిర్మల దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి.”సాక్షి” అనే చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది.సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ.సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కు పైగా చిత్రాలను నిర్మించారు.తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.తెలుగు,తమిళ,మలయాళం భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002 లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణని రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ విజయ నిర్మల కొడుకు.ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం.అప్పటికే కృష్ణ,విజయ నిర్మలకు విడివిడిగా సంతానం ఉండటం చేత వీళ్లిద్దరు మాత్రం సంతానం వద్దనుకున్నారు.గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ (జూన్ 27 2019) అనగా బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.విజయ నిర్మల తెలుగు,తమిళ,మలయాళంలో 200కు పైగా చిత్రాల్లో నటించారు.