Movies

నవ్వుల రారాజు పద్మనాభం

The life history of Telugu comedian padmanabham

పద్మనాభం పకపకలతో పలు చిత్రాలు ప్రేక్షకులకు కితకితలు పెట్టాయి. ఆ గిలిగింతలే జనాన్ని నవ్వులవానలో తడిపాయి. 1931 ఆగస్టు 20 జన్మించిన పద్మనాభం పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. మాయాలోకం (1945)తో పరిచయమైన పద్మనాభం ‘పాతాళభైరవి’తో మంచి పేరు సంపాదించారు. తెలుగువారిని అలరించిన పద్మనాభం 2010 ఫిబ్రవరి 20న తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన వర్ధంతి సందర్బంగా పద్మనాభం పంచిన నవ్వుల పువ్వులను గుర్తుచేసుకుందాం..
*పద్మనాభం ను కరుణించిన ‘దేవత’
పద్మనాభం ఉంటే చాలు ఆయన కామెడీతోనే తమ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కదం తొక్కుతాయని ఆ రోజుల్లో సినీజనం విశ్వసించేవారు… అందుకు తగ్గట్టుగానే పద్మనాభం హాస్యం ఎన్నో చిత్రాల్లో అలరించింది… ‘పాతాళభైరవి’ చిత్రం ఎందరికో సినిమాజీవితాన్ని ప్రసాదించింది… వారిలో పద్మనాభం ఒకరు… ఆ సినిమా తరువాత పలు చిత్రాల్లో పద్మనాభం పకపకలు పంచారు… ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పద్మనాభం ఒక్కోమెట్టూ ఎక్కుతూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు.. 1965లో సొంత నిర్మాణసంస్థ ‘రేఖా అండ్ మురళీ కంబైన్స్’ ఆరంభించారు… తొలి ప్రయత్నంలోనే యన్టీఆర్ తో ‘దేవత’ చిత్రం నిర్మించి ఘనవిజయం సాధించారు పద్మనాభం…
*వాడని పువ్వు… పద్మనాభం నవ్వు…
పద్మనాభం ఓ వైపు ఇతరుల చిత్రాల్లో కామెడీ పండిస్తూనే తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా పలు ప్రయోగాలు చేశారు… నిర్మాతగానే కాకుండా దర్శకుడిగానూ అలరించారు… తాను నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ ద్వారానే మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను పరిచయం చేశారు… సినిమాలు నిర్మించి పలు పరాజయాలు ఎదురవ్వడం వల్ల పద్మనాభం ఆర్థికంగా చితికి పోయారు… చివరి రోజుల్లో ఏ సినిమాలో అవకాశం దొరికినా అదే చాలు అనుకుంటూ నటించారు… ఒకప్పుడు ఎందరికో నీడనిచ్చినిచ్చింది పద్మనాభం సంస్థ… అయితే ఎన్నో చిత్రాల్లో నవ్వులు పూయించిన పద్మనాభం చివరకు పలు జీవితసత్యాలు చెబుతూ తనువు చాలించారు… పద్మనాభం బౌతికంగా లేకపోయినా, ఆయన నవ్వు వసివాడని పువ్వులాగే ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉంది