DailyDose

పెరిగిన రూపాయి విలువ-వాణిజ్యం

Rupee Price Increases-Telugu Business News Roundup

*దేశీయ స్టాక్ మార్కెట్ల తో పాటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా మంగళవారం భారీగా పుంజుకుంది. సోమవారం నాట్ ఇముగిమ్పుతో పోలిస్తే రూపాయి 72.50 వద్ద ప్రారంభమైంది. అనంతరం 33 పైసలు పెరిగి 72.43 కు చేరుకుంది,
* మన మార్కెట్లతో పోలిస్తే అమెరికా స్టాక్ మార్కెట్లలో పరిపక్వత ఎక్కువ. అలాగే అస్థిరతలు కొంచెం తక్కువ. ప్రపంచంలో ఆర్థికంగా బలీయమైన స్థానంలో ఉన్న అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమే అవుతుంది. పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. ఆ విధంగా చూసినా అమెరికా ఈక్విటీలకు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచిది. ఇలా అమెరికా స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్న ఫండ్స్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం సూచనీయం కాదు. ఈక్విటీ, డెట్ రెండు రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు వర్గీకరించుకోవడం వైవిధ్యం అవుతుంది. ఇది రిస్క్ను తగ్గిస్తుంది. ఇక ఈక్విటీల్లోనూ వైవిధ్యం కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ వీలు కల్పిస్తుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి మన ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు, కొంత మేర అమెరికా స్టాక్స్కూ కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా మన స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో కేవలం ఎంపిక చేసిన బ్లూచిప్ స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేశాయి. కానీ, ఇదే కాలంలో అమెరికా స్టాక్స్ మంచి పనితీరు ప్రదర్శించాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
*మనదేశంలో కొత్తగా రెండు కరోనా వైరస్‌‌ కేసులు బయటపడ్డట్టు తేలడంతో మార్కెట్లు సోమవారం నష్టపోయాయి. వరుసగా ఏడో రోజు కూడా సూచీలు డీలా పడ్డాయి. ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్‌‌లో ఒకరికి తాజాగా కరోనా సోకినట్టు వార్తలు రాగా, అమ్మకాల ఒత్తిడి ఎక్కువయింది. ఇంట్రాడే లాభాలన్నీ ఆవిరయ్యాయి. సెన్సెక్స్‌‌ ఒకదశలో 1,297 పాయింట్లు లాభపడినా, చివరికి 153 పాయింట్ల నష్టంతో 38,144 వద్ద ముగిసింది. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 11,133 వద్ద ముగిసింది. నిఫ్టీ ఒకదశలో 11,036 వరకు తగ్గినా, చివరికి కోలుకుంది.
*వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొత్త డబుల్ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ .249, రూ .399, రూ .599 రీఛార్జిపై అదనంగా 1.5 జీబీ డేటాను అందించనుంది. రూ. 249 ప్లాన్‌లో 84 జీబీ, రూ.399 ప్లాన్‌లో 168 జీబీ, రూ. 599 ప్లాన్‌లో 252 జీబీ ఫుల్‌ స్పీడ్‌ డేటాను వినియోగదారులకు అందించనుంది. ఈ కొత్త ఆఫర్‌ మొత్తం 23 టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది.
*కేసీపీ లిమిటెడ్ సీఎండీ (ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్) గా వి.ఎల్.ఇందిరాదత్ నియమితులయ్యారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరకు ఛైర్మన్ పదవిలో ఉన్న వి.ఎల్.దత్ చనిపోయిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ఇందిరా దత్ను ఎంపిక చేశారు. అంతేగాకుండా వి.కవిత సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. స్వతంత్ర మహిళా డైరెక్టర్గా జానకి పిళ్లైను ఎంపిక చేశారు. ఈ నియామకాలకు కంపెనీ వాటాదార్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో అనుమతి తీసుకోనున్నారు.
*టెలికాం విభాగానికి (డాట్) మరో రూ.8,004 కోట్ల చెల్లింపులు చేసినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిలను సంస్థ క్రమక్రమంగా చెల్లిస్తోంది. ఫిబ్రవరి 17, 2020న రూ.10,000 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. 2006-07 నుంచి డిసెంబరు 31, 2019 వరకు స్వీయ మదింపు చేసుకుని ఫిబ్రవరి 29, 2020 వరకు వడ్డీతో కలిపి కట్టనున్నట్లు ఎయిర్టెల్ వివరించింది. ‘ఆ లెక్కల ప్రకారం.. అదనంగా రూ.3,004 కోట్లు ఇవ్వడంతో పూర్తి మొత్తం చెల్లించినట్లు అయింది. మరకో రూ.5000 కోట్లను సర్దుబాట్ల కోసం డిపాజిట్ చేశామ’ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో వెల్లడించింది
*ఎయిర్పోర్ట్స్’ వ్యాపార విభాగంలో 49 శాతం వాటా విక్రయించడానికి అనుమతి కోసం వాటాదార్లకు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నోటీసు పంపింది. ఫ్రాన్స్కు చెందిన ఏడీపీ గ్రూప్నకు 49 శాతం వాటా రూ.10,780 కోట్లకు విక్రయించటానికి జీఎంఆర్ గ్రూపు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. జీఎంఆర్ కమలాంగ ఎనర్జీ లిమిటెడ్ను విక్రయించటానికీ వాటాదార్ల అనుమతి తీసుకుంటున్నారు
*పబ్లిక్ ఇష్యూకు ముందు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ రూ.2769 కోట్ల నిధులను 74 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, బిర్లా మ్యూచువల్ ఫండ్ తదితరాలు ఇందులో ఉన్నాయి. గరిష్ఠ పరిమితి ధర అయిన రూ.755 వద్ద మొత్తం 3,66,69,589 షేర్లను కేటాయించినట్లు ఎక్స్ఛేంజీ వివరాలను బట్టి తెలుస్తోంది. మార్చి 2-5 తేదీల్లో జరగనున్న వాటా విక్రయానికి ఇష్యూ ధరల శ్రేణిని రూ.750-755గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
*జౌళి తయారీ కంపెనీ అలోక్ ఇండస్ట్రీస్లో 37.7 శాతం వాటాను రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దివాలా చట్టం కింద వేలంలో అలోక్ ఇండస్ట్రీస్ను జేఎమ్ ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కోతో కలిసి రిలయన్స్ కొనుగోలు చేసింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ ధర్మాసనం ఈ సంయుక్త బిడ్కు గతేడాదే ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం.. ఒక్కోటి రూ.1 ముఖ విలువ ఉండే 83.33 కోట్ల షేర్లను రూ.2 ప్రీమియంతో కలిపి, మొత్తం రూ.250 కోట్లకు ఆర్ఐఎల్కు శనివారం అలోక్ కేటాయించింది
*భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నుంచి రెండు యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్) తీసుకొస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ ప్రకటించారు. ఇందులో ఒకటి ఏక ప్రీమియం పాలసీ నివేశ్ ప్లస్. ఈ పాలసీలో కనీస ప్రీమియం రూ.లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. చెల్లించిన ప్రీమియానికి 1.25 రెట్లు లేదా 10 రెట్ల వరకు బీమా రక్షణ ఎంచుకోవచ్చు. మరో పాలసీ ‘సీప్’. ఇది బీమా, పెట్టుబడికి ఉపయోగపడే పాలసీ. దీనికి కనీస ప్రీమియం ఏడాదికి రూ.40,000. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. 55 ఏళ్లలోపు వారికి చెల్లించిన వార్షిక ప్రీమియానికి 10 రెట్లు, అంతకుమించి వయసున్న వారికి 7 రెట్ల వరకూ బీమా రక్షణ లభిస్తుంది.
*స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓ) తమ అవసరాలకు తగ్గట్లుగా ఆర్థిక మార్కెట్ల నుంచి నిధులు సమీకరించేందుకు వీలుకల్పించే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని సెబీ సీజీఎం జీవన్ సోన్పరోటే తెలిపారు. శనివారం ఇక్కడ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఏర్పాటు చేసిన ‘స్టార్టప్ కనెక్ట్ 2020’ కార్యక్రమంలో ఆయన ఈ అంశాన్ని వెల్లడించారు. మూలధన నిధుల సమీకరణ, ఇతర అంశాల్లో అంకుర సంస్థలకు తమ వంతుగా చేయూత నిస్తామని జీవన్ స్పష్టం చేశారు.