DailyDose

ఏసీబీ వలలో ట్రాన్స్ కో అధికారి-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-ACB Arrests Transco Officer

*ఉన్నావ్ హత్య కేసులో లైంగిక దాడి ఘటనలో బాధితులరి తండ్రి హత్య కేసులో డిల్లి కోర్టు భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సేన్గార్ ను పదేళ్ళ జైలు శిక్ష విధించింది. సేన్గార్ కు శిక్షను ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ హత్యాచారం కేసులో సేన్గార్ ను డిల్లి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.
* ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై పాతబస్తీ మొగల్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అసదుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. *కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ మెల్లిమెల్లిగా విశ్వవ్యాపితం అవుతోంది. కరోనా వైరస్‌ రోజురోజుకూ ఉధృత రూపం దాలుస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. పెగడపల్లి మండలం లింగపూర్‌ యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు సమాచారం. తీవ్ర జ్వరం, జలుబుతో యువకుడు ఆస్పత్రిలో చేరాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి యువకుడు వచ్చినట్లు గుర్తించారు.
* దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న పేద,నిరుపేద కుటుంబాలకు ఆకలికేకల నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న సబ్సిడీ బియ్యాన్ని కంబదూరు ఎస్ఐ గౌస్ ఫీరా శుక్రవారం పట్టుకున్నారు
* వివాహేతర సంబంధం ఓ వితంతువు ప్రాణాలను బలిగొంది. తోడబుట్టిన అన్నదమ్ములే ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని న్యూమండి పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
* హన్మకొండ పద్మాక్షమ్మ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని సరస్వతిఆత్మహత్య చేసుకుంది. సరస్వతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాస్తోంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా రాయలేదన్న మనస్తాపంతో తెల్లవారు జామున ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి చెందిన సుమన్ రాజవ్వ అనూష గా గుర్తించారు. సుమన్ తన చెల్లి పెళ్లికి చెందిన పత్రికలు పంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కుటుంబంలోగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు బరితెగించారు. ఓ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారు. శుక్రవారం తొట్టంబేడు మండలం చిప్పలకు చెందిన బత్తయ్య అనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై జనసేన కార్యకర్తలు కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన బత్తయ్యకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగుల్లో పడి ఉన్న బత్తయ్యను ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం బత్తయ్యను చంపుతామని హెచ్చరించిన జనసేన కార్యకర్తలు ఈ రోజు పథకం ప్రకారం దాడికి చేశారు.
*పటాన్ చెరువు మండలం రామచంద్రపురం గ్రామ సమీపంలో, ముంబై నుండి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇంజన్ లో మంటలు రావడంతో, డ్రైవర్ అప్రమత్తతో, బస్సులో ఉన్న 25 మంది ప్యాసింజర్స్ ను, కిందికి దింపాడు. అంతలోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో ఉన్న లగేజి మొత్తం కాలి బూడిద అయింది…
*మలాపూర్ మండలం శనిగరం గ్రామంలో, వాటర్ ట్యాంక్ ఎక్కిన సిఐ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ మార్త మహేష్. గత కొన్ని రోజుల నుంచి సెలవు కావాలని అడిగిన, అధికారులు సెలవులు ఇవ్వడం లేదని, వేదిస్తున్నారని ఆరోపిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న మహేష్..
*రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీలో చోరికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న అనిమినీడి జగదీష్, అమృత వల్లిలు పథకం ప్రకారం చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అప్పులు బారి నుంచి బయటపడేందుకు నిందితులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
*ఓ లారీ సృష్టించిన బీభత్సంలో చిన్నారి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద జాతీయరహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లను లారీ ఢీకొట్టింది. నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
*కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన బుధవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటు చేసుకుంది.
*ఛత్తీస్గఢ్లో ఓ జవాన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దంతెవాడ జిల్లా పొటాలి వద్ద నెలకొల్పిన స్పెషల్ టాస్క్ఫోర్స్ క్యాంపులో రాజస్థాన్కు చెందిన ఎస్టీఎఫ్ జవాన్ రామరామ్స్వామి గురువారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని అక్కడికక్కడే మృతిచెందాడు.
*హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఇద్దరు మిత్రులు గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన అబ్బు అనే వ్యక్తి మోసిన్ అనే అతడిని అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై గొంతు కోసం హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మోసిన్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
*మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై గురువారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పనసపండ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిపైకి దూసుకుపోవడంతో లారీ బోల్తాపడి ఇల్లు కూలిపోయింది. ఆ మార్గంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు.
*తెదేపా నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తురకా కిషోర్ గురువారం స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. బుధవారం మాచర్లలో జరిగిన దాడి నేపథ్యంలో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం 13వ వార్డు వైకాపా అభ్యర్థిగా కిషోర్ తరఫున మహంకాళి కన్నారావు అనే వ్యక్తి నామపత్రాలు దాఖలు చేశారు.
*ఒడిశా రాష్ట్రం ఖుర్ధా జిల్లా జట్నీ, పిపిలి, ఎయిర్ఫీల్డ్ ప్రాంతాల్లో క్రైంబ్రాంచ్ స్పెషల్ టాస్క్ఫోర్సు (ఎస్టీఎఫ్) అధికారులు మూడు బృందాలుగా దాడులు నిర్వహించి 1.749 కిలోల బ్రౌన్షుగర్ స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీజీపీ అభయ్ తెలిపారు. ఇంత భారీస్థాయిలో బ్రౌన్షుగర్ స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అన్నారు. దీని విలువ రూ.1.5 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు.
*మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగాఉంది. భారీగా వాహన రాకపోకలకు అంతరాయమేర్పడింది. నిర్మాణ పనుల వల్ల పైవంతెనను మూసివేయగా..సర్వీసు రోడ్డు నుంచి వాహనాలు వెళ్తున్నాయి. ఈక్రమంలో పనసకాయల లోడుతో హైదరాబాద్కు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లడంతో పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబంలోని దంపతులు పనులకోసం, చిన్నారులు బడికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
*రాజస్థాన్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శిరోహి జిల్లాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడం స్థానికంగా విషాదం నింపింది. పిండ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్య (30) అనే మహిళ తన కూతురు లీల (8), కుమారులు కృష్ణ (6), మొంటు (5)లతో కలిసి ఈ ఘోరానికి పాల్పడింది.
*కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో-లారీ ఢీ కొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్ బండి ఆది సజీవదహనమయ్యారు.
* పేట్ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోదావరి హోమ్స్‌ గాయత్రి నగర్‌లో సుభాష్ (32) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు.